దారుణం : వాట్సప్ స్టేటస్ ప్రాణాలు తీసింది.. !

Published : Jan 18, 2021, 09:15 AM IST
దారుణం : వాట్సప్ స్టేటస్ ప్రాణాలు తీసింది.. !

సారాంశం

వాట్సప్ స్టేటస్ ఓ హత్యకు దారి తీసిన దారుణ ఘటన కర్ణాటకలో జరిగింది.  ఫొటోల వ్యవహారం ఓ దళిత యువకుడి హత్యకు దారితీసింది. వాట్సాప్‌ స్టేటస్‌లో ఫొటోలు పెట్టాడన్న కోపంతో ఈ దారుణానికి పాల్పడ్డారు ఇద్దరు వ్యక్తులు. ఈ సంఘటన కర్ణాటకలోని యశవంతపురలో ఆదివారం కలకలం రేపింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రహళ్లికి చెందిన అభి ప్రవీణ, మనోజ్‌ అనే యువకుల ఫొటోలను అదే ప్రాంతానికి చెందిన శీను అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. దీంతో ఆ ఇద్దరు యువకులు శీనా ఇంటికి వెళ్లి చాకుతో పొడిచి ఉడాయించారు. 

తీవ్ర గాయాలతో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా హతుడు దళిత సంఘంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. రాజగోపాల్‌నగర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

AI Smart Glasses : పోలీసుల చేతికి ఏఐ అస్త్రం.. ఈ మ్యాజిక్ గ్లాసెస్ నేరస్తులను ఎలా గుర్తిస్తాయి?
uttar Pradsh : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే టాప్... ఏ రాష్ట్రమో తెలుసా?