నా భార్యకు ముద్దు కూడా పెట్టలేకపోయా.. ఫరూక్ అబ్దుల్లా..!

Published : Jan 18, 2021, 09:03 AM IST
నా భార్యకు ముద్దు కూడా పెట్టలేకపోయా.. ఫరూక్ అబ్దుల్లా..!

సారాంశం

నిర్భయంగా తన భార్యకు ముద్దు కూడా ఇవ్వలేకపోయానని వాపోయారు. ఫరూక్ అబ్దుల్లా నోటి వెంట ఈ మాట రాగానే అక్కడున్నవారంతా పెద్దపెట్టున నవ్వారు. 

కరోనా మహమ్మారి దేశంలో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ మహమ్మారి నేపథ్యంలో.. తాను కనీసం తన భార్యకు ముద్దు కూడా ఇవ్వలేకపోయానంటూ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు.

జమ్ములో జరిగిన ఒక పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ అత్యంత విచిత్రమైన పరిస్థితులను కల్పించిందన్నారు. చివరికి నిర్భయంగా తన భార్యకు ముద్దు కూడా ఇవ్వలేకపోయానని వాపోయారు. ఫరూక్ అబ్దుల్లా నోటి వెంట ఈ మాట రాగానే అక్కడున్నవారంతా పెద్దపెట్టున నవ్వారు. 

కరోనా భయాల కారణంగా షేక్‌హ్యాండ్ ఇచ్చుకోలేకపోతున్నామని, కావలించుకోవాలంటే మరింత భయపడుతున్నామని అన్నారు. చివరికి తాను తన భార్యకు ముద్దు కూడా పెట్టలేకపోయానని, ఇక ఆలింగనం సంగతి అసలే లేదన్నారు. తన మనుసులో ఉన్నది దాచుకోకుండా చెప్పేశానని అన్నారు.

 ఈ మాటలు విన్నవెంటనే అక్కడున్నవారంతా హాయిగా నవ్వుకున్నారు. ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలతో కూడిన వీడియోను అక్కడున్నవారు సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా కోవిడ్-19 టీకా గురించి మాట్లాడిన ఫరూక్ అబ్దుల్లా... టీకాను అభివృద్ధి చేయడంలో భారత్ విజయవంతమైందన్నారు.

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?