మైనర్ బాలికపై కన్ను.. ఐదు రోజుల్లో రెండుసార్లు అత్యాచారం..

Published : Jan 18, 2021, 07:56 AM IST
మైనర్ బాలికపై కన్ను.. ఐదు రోజుల్లో రెండుసార్లు అత్యాచారం..

సారాంశం

అతనితోపాటు మరో ఆరుగురు వ్యక్తులు బాలికను ఎవరూలేని ప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.  ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ బెదిరించి.. బాధితురాలిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.

దేశంలో రోజు రోజుకీ అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రం సింధి జిల్లాలో ఓ మహిళపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడగా తాజాగా.. మరో దారుణం వెలుగుచూసింది. 13ఏళ్ల మైనర్ బాలికపై తొమ్మిది మంది వ్యక్తులు కేవలం ఐదు రోజుల వ్యవధిలో రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 13ఏళ్ల మైనర్ బాలిక ఈ నెల 4వ తేదీన అపహరణకు గురైంది. తెలిసిన వ్యక్తే ఆమెను కిడ్నాప్ చేయడం గమనార్హం. అనంతరం అతనితోపాటు మరో ఆరుగురు వ్యక్తులు బాలికను ఎవరూలేని ప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.  ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ బెదిరించి.. బాధితురాలిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.

కాగా.. ఆ తర్వాత మళ్లీ జనవరి 11వ తేదీన నిందితుల్లో ముగ్గురు వ్యక్తులు మరోసారి బాలికను కిడ్నాప్ చేశారు. వారితోపాటు.. మరో ఇద్దరు లారీ డ్రైవర్ల సహాయంతో మరోసారి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారిదగ్గరే బాలికను బంధించారు.

తాజాగా.. ఆ రాక్షసుల బారీ నుంచి బయటపడిన బాలిక పోలీసులను ఆశ్రయించింది. ఆ బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

జానకమ్మ జీవితం..ఓ చరిత్ర ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా? | Singer S. Janaki Biography | S Janaki Assets
గాన కోకిల జానకమ్మ చివరి మాటలు ఇవే | Singer S. Janaki No More | Singer S. Janaki Last Word