
భార్యభర్తల గొడవ ఏ సంబంధమూ లేని వ్యక్తి ప్రాణాల మీదికి వచ్చింది. భార్యాభర్తల మధ్య గొడవ ఆపేందుకు వెళ్లిన వ్యక్తి అన్యాయంగా హత్యకు గురైన సంఘటన తమిళనాడులోని టీ.నగర్ లో కలకలం రేపింది.
సోమవారం తంజావూరు జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన వివరాల్లోకి వెడితే.. ఒరత్తనాడు పుదూరుకు చెందిన రాజేంద్రన్ (60) ప్రైవేట్ మిల్లులో పనిచేస్తున్నారు. అతనితో పాటు అమ్మాపేటకు చెందిన సూసైరాజ్ పనిచేస్తున్నాడు.
కోడిగుడ్డు కోసం పోతే.. ప్రాణాలు పోయాయి... !...
ఇలా ఉండగా సోమవారం రాత్రి మిల్లులో సూసైరాజ్, అతని భార్య మధ్య గొడవ జరిగింది. వారికి సర్దిచెప్పేందుకు రాజేంద్రన్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో రాజేంద్రన్, సూసైరాజ్ గొడవ పడ్డారు.
కోపానికొచ్చి సూసైరాజ్ కత్తితో రాజేంద్రన్ మీద దాడి చేశాడు. దీంతో సంఘటనా స్థలంలోనే రాజేంద్రన్ మృతి చెందాడు. సమాచారం అందుకన్న ఒరత్తనాడు పోలీసులు రాజేంద్రన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. సూసైరాజ్ ను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.