లవ్ అఫైర్: టీవీ నటితో గొడవ, సహాయ దర్శకుడితో సహా ముగ్గురి అరెస్టు

Published : Apr 21, 2021, 08:27 AM IST
లవ్ అఫైర్: టీవీ నటితో గొడవ, సహాయ దర్శకుడితో సహా ముగ్గురి అరెస్టు

సారాంశం

ప్రేమ వ్యవహారంలో టీవీ నటితో గొడవ పడిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో ఓ సహాయ దర్శకుడు కూడా ఉన్నాడు. ఈ సంఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది.

చెన్నై: టీవీ నటి జెనీఫర్ తో గొడవ పడిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు ప్రేమ వ్యవహారానికి సంబంధించి టీవీ నటితో వారు గొడవ పడ్డారు. వారిలో ఓ సహాయ దర్శకుడు కూడా ఉన్నాడు. వారిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. 

తమిళనాడు రాజధాని చెన్నై మనలి బాలాజీ పాలయానికి చెందిన జెనీఫర్ (2) టీవీ నటి. 2019లో జెనీఫర్ కు శరవణన్ తో పెళ్లయింది. ఆ తర్వాత విభేదాలు తలెత్తడంతో ఇద్దరు కూడా విడిపోయారు కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. అది విచారణలో ఉంది. 

కాగా, టీవీ సీరియల్ లో సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న నవీన్ కుమార్ (25)తో జెనీఫర్ కు పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారి తీసింది. జెనీఫర్ కు అప్పటికే వివాహమైన విషయం నవీన్ కుమార్ కు తెలిసింది. దాంతో అతను ఆమెను నిలదీశాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. 

ఆదివారం మధ్యాహ్నం నవీన్ కుమార్, అతని మిత్రులు జెనీఫర్ ఇంటికి వెళ్లి గొడవ చేశారు. ఈ గొడవ కారణంగా నీవన్ కుమార్, పాండియన్, కార్తికేయన్ లను పోలీసులు అరెస్టు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Space War: పాకిస్థాన్ మరో కుట్ర.. 16 నెలల్లో 6 శాటిలైట్లు.. భారత్‌పై చైనా సాయంతో నిఘా !
ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఇకలేరు | Indian Cinema Legend Bharathiraja Passes Away| Asianet Telugu