కార్గో లోడ్ చేసి అలిసి విమానంలోనే నిద్ర.. కళ్లు తెరిస్తే అబుదాబిలో.. ఆ తర్వాత..

By Mahesh KFirst Published Dec 14, 2021, 6:00 PM IST
Highlights

ముంబయి నుంచి అబుదాబికి బయల్దేరాల్సిన ఓ విమానంలోకి కార్గో లోడ్ ఎక్కించి ఓ వర్కర్ లోపలే అలసటతో నిద్రలోకి జారిపోయాడు. ఆయన అందులోనే నిద్రిస్తుండగా ఇండిగో విమానం ముంబయి నుంచి అబుదాబికి బయల్దేరింది. ఫ్లైట్ టేకాఫ్ అయిన తర్వాత ఆ వర్కర్‌కు తెలిసింది. గంటల వ్యవధిలోనే ఆయన అబుదాబి ఎయిర్‌పోర్టు చేరుకున్నారు. అక్కడ ఆయన ఆరోగ్యాన్ని పరీక్షించి తర్వాతి ఫ్లైట్‌లోనే ప్యాసింజర్‌గా వెనక్కి పంపించేశారు.

ముంబయి: విమానం(Flight) గంటల్లో దేశం దాటేస్తుంది. ఒక్క కునుకు తీస్తే సరిహద్దులు దాటి వెళ్తుంది. అలాంటి విమానంలో ఓ కార్మికుడు కార్గో లోడ్ చేసి అలిసి అనుకోకుండానే విమానంలోని కార్గో ఏరియాలో నిద్రలోకి జారిపోయాడు. ఆయన లోడ్ వెనుక ఉండిపోవడంతో ఆ విమానం తలుపులూ మూసుకున్నాయి. అంతే.. గంటల్లో ఆయన అబుదాబి చేరుకున్నాడు. కార్గో ఏరియా తలుపులు తెరవగానే ఆయన ముందు ముంబయి ఎయిర్‌పోర్టు కాకుండా Abudabi నగరం ప్రత్యక్షమైంది. ఆయన ముంబయి నుంచి అబుదాబి ప్రయాణించిన విషయం ఆయనకు కూడా తెలియదు.. విమాన సిబ్బందికీ తెలియదు. దీని పై ప్రస్తుతం డీజీసీఏ దర్యాప్తు మొదలు పెట్టింది.

ఈ ఘటనపై డీజీసీఏ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ మాట్లాడారు. ఆదివారం ఇండిగో ఏ320 ఎయిర్‌క్రాఫ్ట్ ముంబయి నుంచి అబుదాబికి ప్రయాణించిందని అన్నారు. ఆ విమానంలో డ్యూటీలో ఉన్న వర్కర్లతో పోటు ఆఫ్ రోస్టర్‌లో ఉన్న మరో వర్కర్ కూడా కార్గో లోడ్ చేశారు. కార్గో లోడింగ్ తర్వాత ఆఫ్ రోస్టర్‌లో ఉన్న వర్కర్ విమానంలోని బ్యాగేజ్ కంపార్ట్‌మెంట్ 1లో అలసటతో నిద్రలోకి జారుకున్నాడు. కార్గో వెనుకాల ఆయన కునుకు తీశాడు. ఇంతలోనే కార్గో ఏరియా డోర్ మూసుకుపోయింది. ఆ తర్వాత హోల్డ్ స్టాఫ్ సిబ్బందిని లెక్కించాడు.

Also Read: ఫ్లైట్‌లో ప్రయాణికుడికి ప్రథమ చికిత్స అందించిన కేంద్ర మంత్రి, తోటి ప్రయాణికుల నుంచి ప్రశంసలు

కానీ, ఆయన కార్గో కంపార్ట్‌మెంట్‌లోనే ఉండిపోయాడని ఎవరూ గుర్తించ లేకపోయారు. ఇంతలో విమానం ముంబయి ఎయిర్‌పోర్టు నుంచి అబుదాబికి బయల్దేరింది. ముంబయి ఎయిర్‌పోర్టులో విమానం టేకాఫ్ కాగానే.. కార్గో ఏరియాలో పడుకున్న ఆ వర్కర్ మేల్కున్నాడు. ఆయన కార్గో కంపార్ట్‌మెంట్‌లో ఉన్నట్టు అబుదాబి చేరిన తర్వాత సిబ్బంది గుర్తించారు. అనంతరం ఆయన ఆరోగ్యాన్ని పరీక్షించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్ట నిర్ధారించారు. స్థానిక అధికారుల నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత మళ్లీ తర్వాతి ఫ్లైట్‌లోనే ఆయనను అబుదాబి నుంచి ముంబయికి ప్యాసింజర్ టికెట్‌పై వెనక్కి పంపారు.

ఈ ఘటనపై ఇండిగో స్పోక్స్‌పర్సన్ మాట్లాడారు. ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని వివరించారు. సంబంధిత అధికారులకు విషయాన్ని చేరవేశామని తెలిపారు. ప్రస్తుతం ఈ విషయంపై దర్యాప్తు జరుగుతున్నదని చెప్పారు. కార్గో లోడ్ చేసిన తర్వాత నిద్ర పోయి అబుదాబికి చేరిన ఆ వ్యక్తి ఆఫ్ రోస్టర్‌లో ఉన్నారని డీజీసీఏ డీజీ అరుణ్ కుమార్ చెప్పారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్నదని వివరించారు.

Also Read: 50ఏళ్ల మిస్టరీ.. ఫ్లైట్ హైజాక్ చేసి ఆకాశంలోనే మాయమైన ఆ వ్యక్తి వివరాలు ఇంకా రహస్యమే

ఇండిగో ఫ్లైట్‌లోనే ఇటీవలే ఓ ప్రయాణికుడు అనారోగ్యానికి గురైతే కేంద్ర మంత్రి ప్రథమ చికిత్స అందించిన సంగతి తెలిసిందే.  Indigo విమానం.. Delhi నుంచి Mumbai కి బయల్దేరింది. టేకాఫ్ అయినాక ఒక గంట తర్వాత ఓ ప్రయాణికుడు ఆరోగ్య సమస్యతో తల్లడిల్లాడు. ఉన్నట్టుండి తల తిప్పినట్టు అవుతున్నదని, తీవ్ర నీరసం ఆవహించిందని చెప్పాడు. Flightలో ఆకాశంలో ఉన్నది. ప్రథమ చికిత్స కిట్ ఉన్నది.. కానీ.. వైద్యులెవరైనా ఉంటే బాగుండు అని ఫ్లైట్ సిబ్బందికి అనిపించింది. తోటి ప్రయాణికుల్లో ఎవరైనా వైద్యులు ఉన్నారా? అని అడిగారు. ఈ ప్రకటన వినీ వినగానే Union Minister డాక్టర్ భాగవత్ కిషన్‌రావు కరద్ ఆ పేషెంట్ దగ్గరకు పరుగన వెళ్లి ప్రథమ చికిత్స అందించాడు.

click me!