భార్యను చంపి శవాన్ని ముక్కలు చేసి గ్రైండ్ చేసి కాల్చేశాడు

By telugu teamFirst Published Jan 16, 2020, 12:21 PM IST
Highlights

రవీంద్ర కుమార్ అనే వ్యక్తి తన భార్య ఊర్మిళను గొంతు నులిమి చంపి శవాన్ని ముక్కలు చేసి, గ్రైండ్ చేసి కాల్చేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయబరేలీలో జరిగింది. 

రాయబరేలి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన సంఘటన వెలుగు చూసింది. గర్భవతి అయిన తన భార్యను గొంతు నులిమి ఓ వ్యక్తి హత్య చేశాడు. ఆమె శవాన్ని ముక్కలు చేసి కాల్చేశాడు. ఆ తర్వాత బూడిదతో కూడిన శరీర భాగాలను రాయబరేలీ శివారులో పడేశారు. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. 

ఈ దారుణమైన హత్య జనవరి 4వ తేదీన జరిగింది. అయితే మంగళవారంనాడు అది వెలుగులోకి వచ్చింది. తన తండ్రి తన తల్లిని హత్య చేస్తుండడాన్ని కూతురు చూసింది. ఆ తర్వాత ఆమె అమ్మమ్మ ఇంటికి వెళ్లి విషయం చెప్పింది. 

Also Read: మరదలితో అఫైర్: దోపిడీ ప్లాన్ వేసి భార్యను చంపేశాడు

దాంతో మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు రవీంద్ర కుమార్ (35)ను పోలీసులు అరెస్టు చేశారు. కాల్చిన శవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని లక్నోలోని ఫోరెన్సిక్ లాబొరేటరీకి పరీక్షల నిమిత్తం పంపించారు. 

ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు రవీంద్ర ఇంటికి వెళ్లారు. మహిళ కోసం వారు గాలించారు. కానీ ఆమె కనిపించలేదు. జనవరి 10వ తేదీన ఊర్మిళ సోదరి విద్యా దేవి దీహ్ పోలీసు స్టేషన్ కు వెళ్లి రవీంద్రపై ఫిర్యాదు చేసింది. తన సోదరిని రవీంద్ర చంపాడని విద్యాదేవి పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఆరోపించింది. 

జనవరి 4వ తేదీన రవీందర్ కుమార్ యూపీ112కు ఫోన్ చేసి తన భార్య కనిపించడం లేదని చెప్పాడు. ఊర్మిళ రవీంద్రను 2011లో పెళ్లి చేసుకున్నాడు. వారికి 7,11 ఏళ్ల వయస్సు గల ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 

Also Read: ప్రియునితో అఫైర్, భర్తను చంపిన భార్య: పోలీసాఫీసర్ తోనూ రాసలీలలు

రవీంద్రకు కుమారుడు పుట్టాలని కోరిక ఉండేదని, తన భార్య మళ్లీ కూతురినే కంటుందని అనుమానించాడని పోలీసులు అంటున్నారు. తన తల్లి హత్యలో తన తాత కరమ్ చంద్ర, అంకుల్స్ సంజీవ్, బ్రిజేష్ కూడా పాలు పంచుకున్నారని రవీంద్ర పెద్ద కూతురు చెబుతోంది. 

రవీంద్రను అరెస్టు చేయడానికి పోలీసుల బృందం ఇంటికి వెళ్లింది. అయితే, అతను అక్కడి నుంచి పరారయ్యాడు. అతన్ని పట్టుకోవడానికి ఆరు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. చివరకు మంగళవారం అతన్ని అరెస్టు చేయగలిగారు.

పోలీసుల విచారణలో రవీంద్ర కుమార్ నేరాన్ని అంగీకరించాడు. తమ ఇరువురి మధ్య గొడవ జరిగిందని, ఈ గొడవలో తాను భార్య గొంతు నులిమి చంపానని, ఆ తర్వాత పదునైన ఆయుధంతో శవాన్ని ముక్కలు చేశానని, పిండి గిర్నీలో గ్రైండ్ చేశానని అతను చెప్పాడు. ఆ తర్వాత కాల్చేశానని చెప్పాడు.

కాలిన పదార్థాలను గన్నీ బ్యాగులో పెట్టి ఇంటికి 4 కిలోమీటర్ల దూరంలో పడేసినట్లు రవీంద్ర కుమార్ పోలీసులకు తెలిపారు. 

click me!