ఫేస్‌బుక్‌ పేజ్‌లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు: అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులకు షాక్

By Siva Kodati  |  First Published Apr 20, 2020, 6:51 PM IST

ఇటీవలి కాలంలో సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి. ఈ నేపధ్యంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిందన్న అభియోగంపై ఓ యువతిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. 


ఇటీవలి కాలంలో సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి. ఈ నేపధ్యంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిందన్న అభియోగంపై ఓ యువతిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది.

వివరాల్లోకి వెళితే.. నిషా జిందాల్ అనే పేరుతో ఫేస్‌బుక్‌లో పేజ్ వుంది. హీరోయిన్‌ కంటే అందంగా వున్న ప్రోఫైల్ పిక్ ఉండటంతో సుమారు 10 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.

Latest Videos

Also Read:జర్నలిస్టులకు కరోనా దెబ్బ: ముంబైలో 53 మందికి కరోనా

అయితే గత ఎనిమిదేళ్లుగా నడుస్తున్న ఈ పేజీలో ఈ మధ్యకాలంలో ఎవరో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్ పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ పేజ్‌పై ఫోకస్ పెట్టి  ఆరా తీరారు. ఈ నేపథ్యంలో ఇదంతా రాయ్‌పూర్‌కి చెందిన ఓ వ్యక్తి పనిగా తేల్చారు. అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులకు అక్కడ నిషా జిందాల్‌కు బదులుగా పురుషుడు కనిపించడంతో షాక్‌కు గురయ్యారు.

వెంటనే అతనిని అదుపులోకి తీసుకుని లాప్‌టాప్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పలు సెక్షన్ల కింద అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రవిని ఫోటో తీసి. అతడి ఫేక్ ఖాతాల్లో అసలు రూపం బయటపెట్టారు.

నేనే నిషా జిందాల్... నేను పోలీస్ కస్టడీలో ఉన్నానని పోస్ట్ చేశారు. ఇతను ఐఎంఎఫ్, డబ్ల్యూహెచ్‌వో, డబ్ల్యూటీవో వంటి సంస్థల్లో ఉద్యోగం అంటూ బడాయిపోయిన అతను 11 ఏళ్లుగా ఇంజనీరింగ్ డిగ్రీ పరీక్షలతో కుస్తీ పడుతున్నట్లు తేల్చారు.

Also Read:59 జిల్లాల్లో 14 రోజులుగా కరోనా కేసులు లేవు: కేంద్ర ఆరోగ్య శాఖ

ఒక్క నిషా జిందాల్... 2012 నుంచి పాకిస్తాన్ నటి మిరాషా పాషా లాంటి పేర్లతో రవి అనేక నకిలీ ఖాతాలు నిర్వహిస్తున్నట్లు సైబర్ పోలీసులు గుర్తించారు. ఎవరికీ ఏమాత్రం అనుమానం రాకుండా అతడు జాగ్రత్తలు తీసుకోవడంతో 10 వేల మంది ఫాలోవర్లు ఆ పేజ్‌ను ఫాలో అవుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

కాగా ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బాఘెల్ ట్విట్టర్ ద్వారా పోలీసులను అభినందించారు. మోసగాళ్లను వదిలే ప్రసక్తే లేదని... సమాజాన్ని తప్పుదోవ పట్టించడమే పనిగా పెట్టుకున్న ఇలాంటి శక్తులన్నిటీని రట్టు చేయాలని సీఎం స్పష్టం చేశారు. 

click me!