వినాయక ఊరేగింపులో మహిళకు వేధింపులు.. వ్యక్తి అరెస్టు...

Google News Follow Us

సారాంశం

నవీ ముంబైలోని ఓ ఆటోరిక్షా డ్రైవర్ గణేశ విగ్రహ నిమజ్జనం ఊరేగింపులో మహిళను వేధింపులకు గురిచేశాడు. మాటలతో వేధించాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

ముంబై : దేవుడి ఊరేగింపు అని కూడా చూడకుండా మహిళ మీద వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నవీ ముంబైలో గణేశ విగ్రహం నిమజ్జనం ఊరేగింపులో మహిళను వేధింపులకు గురిచేశాడో వ్యక్తి. అంతటితో ఆగకుండా, దూషించాడు. ఆ ఆటోరిక్షా డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.

సెప్టెంబరు 24న తుర్భేలో జరిగిన సంఘటనపై పోలీసులు సెక్షన్ 354 (మహిళపై దాడి చేయడం లేదా క్రిమినల్ బలవంతం చేయడం, ఆమె అణకువకు భంగం కలిగించడం), భారతీయ శిక్షాస్మృతిలోని ఇతర సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేసినట్లు అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ దత్తా దఫాల్ అన్నారు.

ఢిల్లీ జ్యువెలర్స్‌లో రూ. 25-కోట్ల నగలు దోపిడీ.. సీసీటీవీ కనెక్షన్ కట్ చేసి, స్ట్రాంగ్ రూంకు కన్నం వేసి...

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో తుర్భే నాకా గుండా వినాయక విగ్రహం నిమజ్జన ఊరేగింపు జరుగుతుండగా, మద్యం మత్తులో ఉన్న నిందితుడు.. బాధితురాలి చేయి పట్టుకుని అసభ్యపదజాలంతో దూషించారని తెలిపారు.

నిందితులు ఆమెను వేధిస్తున్నాడని ఆరోపించడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని అధికారి తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారని, ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని తెలిపారు.