అందరి ముందే అతని ముఖం, చెంపలపై చెప్పుతో ఇష్టం వచ్చినట్లు కొట్టింది. అనంతరం అతనిని వదిలిపెట్టమని కోరడం గమనార్హం.
నడి రోడ్డుపై ఓ యువకుడిని యువతి చెప్పుతో కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ యువతి అతనిని ఎందుకు కొట్టిందో తెలుసా? ఓ యువతిని దారుణంగా ఏడిపించాడు. అందుకే చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లాలో కాలేజీ విద్యార్థిని ఓ యువకుడు వేధించాడు. దీంతో, ఆమె గ్రామస్థుల సహాయంతో అతనికి బుద్ధి చెప్పింది. అందరి ముందే అతని ముఖం, చెంపలపై చెప్పుతో ఇష్టం వచ్చినట్లు కొట్టింది. అనంతరం అతనిని వదిలిపెట్టమని కోరడం గమనార్హం.
అయితే, ఆ అమ్మాయి కొడుతున్నా, ఆ అబ్బాయి ఏ మాత్రం కదలకుండా అక్కడ నిలపడటం విశేషం. శుక్రవారం ఉదయం హాస్టల్ నుంచి కాలేజీకి వెళ్తున్న బాలికను ఆ వ్యక్తి వెంబడించి వేధించాడని స్థానికులు చెబుతున్నారు. కాగా, నిందితుడిని ఆ తర్వాత పోలీసులకు అప్పగించడం గమనార్హం.