‘గాడ్సే-ఆప్టేల వారసులెవరో తెలుసా’ ? కొల్హాపూర్ ఘర్షణల నేపథ్యంలో ఔరంగజేబ్ వ్యాఖ్యలపై ఫడ్నవీస్ పై ఒవైసీ ఫైర్

Published : Jun 10, 2023, 11:46 AM IST
‘గాడ్సే-ఆప్టేల వారసులెవరో తెలుసా’ ? కొల్హాపూర్ ఘర్షణల నేపథ్యంలో ఔరంగజేబ్ వ్యాఖ్యలపై ఫడ్నవీస్ పై ఒవైసీ ఫైర్

సారాంశం

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు నాథూరామ్ గాడ్సే, వామన్ శివరామ్ ఆప్టేల వారసులు ఎవరో తెలుసా అని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ఫడ్నవీస్ అంత నిపుణుడు అని తనకు తెలియదని అన్నారు. 

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవల చేసిన 'ఔరంగజేబ్ కీ ఔలాద్' వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. నాథూరామ్ గాడ్సే, వామన్ శివరామ్ ఆప్టేల వారసులు ఎవరో మీకు తెలుసా అని ప్రశ్నించారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ఔరంగజేబు, టిప్పు సుల్తాన్ లపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టడం వల్ల హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.

దారుణం.. ప్రియుడి ఇంటి వాటర్ ట్యాంకులో శవంగా తేలిన ప్రియురాలు.. అసలేం జరిగిందంటే ?

మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో అకస్మాత్తుగా ఔరంగజేబు కుమారులు జన్మించారని ఫడ్నవీస్ బుధవారం వ్యాఖ్యానించారు. ‘‘వారు ఔరంగజేబు హోదాను తమ పోస్టర్లను చూపిస్తారు. దీంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఔరంగజేబు కుమారులు ఎక్కడి నుంచి వచ్చారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీని వెనుక ఎవరున్నారు? అది కనుక్కుంటాం’’ అని ఆయన అన్నారు.

దీనికి ఒవైసీ కౌంటర్ ఇస్తూ.. మహారాష్ట్ర హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ 'ఔరంగజేబ్ కే ఔలాద్' అని చెప్పారని ఎద్దేవా చేశారు. ‘‘ మరి మీకు అన్నీ తెలుసా? మీరు (ఫడ్నవీస్) అంత ఎక్స్ పర్ట్ అని నాకు తెలియదు. అలా అయితే గాడ్సే, ఆప్టేల పిల్లలు ఎవరో మీకు తెలియాలి.’’ అని అన్నారు.

మరో 24 గంటల్లో బలపడనున్న బిపార్జోయ్ తుఫాన్.. ఈ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం

ఇదిలా వుండగా.. మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో బుధవారం రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. 

కాగా.. కొల్హాపూర్ ఘర్షణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. కొల్హాపూర్ ఘటనలో రాజకీయాలు అవసరం లేదని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ అన్నారు. ‘‘దురదృష్టవశాత్తూ కొందరు ఇలాంటి పరిస్థితిని సృష్టించారు. ఇది సమాజానికి తగదని... సామాన్యులు మూల్యం చెల్లించుకోక తప్పదు... ఇందులో రాజకీయాలు అవసరం లేదన్నారు. దీనిపై విచారణ జరిపితే నిజానిజాలు అందరి ముందుకొస్తాయి’’ అని నేషనలిస్ట్ కాంగ్రెస్ చీఫ్ విలేకరులతో అన్నారు.

ఈ అల్లర్లపై మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే స్పందించారు. శాంతి భద్రతల కోసం ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘‘శాంతి, ప్రశాంతత కోసం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటాం’’ అని షిండే అన్నారు.

దారుణం.. వితంతువుపై దొంగ అత్యాచారం.. అనంతరం నగలు ఎత్తుకెళ్లిన దుండగుడు

కాగా.. కొల్హాపూర్ లో బుధవారం జరిగిన ఆందోళనల్లో అల్లర్లు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారనే అభియోగాలపై పోలీసులు 36 మందిని అరెస్టు చేశారు. శాంతిభద్రతలను పునరుద్ధరించామని చెప్పడంతో నెమ్మదిగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని, ఆందోళనలు జరిగిన ప్రాంతంలో వ్యాపారాలు కూడా తెరుచుకుంటున్నాయని పోలీసులు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Udhayanidhi Stalin Speech: తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉదయనిధి స్టాలిన్ సూపర్ స్పీచ్| Asianet Telugu
Nitish Kumar Takes Oath in Rajya Sabha: రాజ్యసభలో నితీశ్ కుమార్ ప్రమాణం | Asianet News Telugu