బెంగాల్: మమత వచ్చి వెళ్లిన తర్వాత.. అభిషేక్ ఇంటికి సీబీఐ

By Siva KodatiFirst Published Feb 23, 2021, 3:16 PM IST
Highlights

అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత కొద్దిరోజులుగా తృణమూల్ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 

అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత కొద్దిరోజులుగా తృణమూల్ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ నేత అభిషేక్‌ బెనర్జీ నివాసానికి మంగళవారం సీబీఐ అధికారులు చేరుకున్నారు. కోల్ స్కామ్‌ కేసులో భాగంగా అభిషేక్‌ భార్య రుజిరా బెనర్జీని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

ఆమె లావాదేవీలను ఆరా తీస్తున్నారు. అయితే సీబీఐ అధికారులు అభిషేక్‌ ఇంటికి రావడానికి కొద్దిసేపటి ముందే సీఎం మమతా బెనర్జీ వారి ఇంటిని సందర్శించడం గమనార్హం.  

బొగ్గు చౌర్యం కేసులో అభిషేక్‌ బెనర్జీ మరదలు మేనకా గంభీర్‌ను సీబీఐ అధికారులు సోమవారం ప్రశ్నించిన విషయం తెలిసిందే. అనంతరం అభిషేక్‌ బెనర్జీ భార్యకు సమన్లు అందజేశారు. దీనిపై రుజిరా బెనర్జీ స్పందిస్తూ.. అసలు అధికారులు తనను ఎందుకు ప్రశ్నించాలనుకుంటున్నారో తెలియదని ఆమె వెల్లడించారు.  

పశ్చిమబెంగాల్లోని కునుస్తోరియా, ఖజోరియాల్లో అక్రమ మైనింగ్‌ జరిగినట్లు సీబీఐ ఇప్పటికే గుర్తించారు. ఈ వ్యవహారంలో టీఎంసీ నేతలకు మాఫియా నుంచి డబ్బులు అందాయన్న ఆరోపణలపై సీబీఐ గతేడాది నవంబర్‌లోనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.  
 

click me!