బాలికను లైంగికంగా వేధించి, సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసి..

Published : Feb 23, 2021, 01:19 PM IST
బాలికను లైంగికంగా వేధించి, సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసి..

సారాంశం

బీహార్ లో దారుణం జరిగింది. బాలికను లైంగికంగా వేధించి, వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కొందరు యువకులు. ఓ యువకుడితో కలిసి వచ్చిన పాఠశాల బాలికను యువకులు వేధించిన ఘటన బీహార్ రాష్ట్రంలోని గయా జిల్లాలో వెలుగు చూసింది. 

గయాకు చెందిన స్కూల్ స్టూడెంట్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉండటం చూసిన యువకులు రెచ్చిపోయారు. తాము సంఘ సంక్కర్తలమని చెప్పి బాలిక జుట్టు పట్టుకుని లైంగికంగా వేధించారు. బాలికను కొడుతూ, అసభ్యంగా తాకుతూ లైంగికంగా హింసించారు. 

బాలిక తప్పించుకునేందుకు యత్నంచగా, ఆమె బాయ్ ఫ్రెండ్ ను పట్టుకుని చంపేస్తామని బెదిరించారు. అనంతరం యువకులు బాలికను లైంగికంగా వేధించారు. ఈ ఘటనను వారే వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

దీంతో తాము కేసు నమోదు చేసి బాలికను వేధించిన యువకులను గుర్తించేందుకు యత్నిస్తున్నామని ఎస్పీ ఆదిత్యకుమార్ చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Aadhaar Card New Rules : 2026లో ఆధార్ అప్‌డేట్ చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరి !
Jobs : కేవలం జనవరి ఒక్క నెలలోనే.. లక్ష ఉద్యోగాల భర్తీకి సర్కార్ సిద్దం