Mamata Banerjee: 'ఇందిరా గాంధీ చంద్రునిపైకి వెళ్లినప్పుడు...': మమతా బెనర్జీ విచిత్ర ప్రకటన.. నెట్టింట్లో వైరల్

Published : Aug 29, 2023, 04:53 PM IST
Mamata Banerjee: 'ఇందిరా గాంధీ చంద్రునిపైకి వెళ్లినప్పుడు...': మమతా బెనర్జీ విచిత్ర ప్రకటన.. నెట్టింట్లో వైరల్

సారాంశం

Mamata Banerjee: తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓ విచిత్రమైన ప్రకటన చేసి వార్తల్లో నిలిచారు. అందరి ముందు అబాసు పాలయ్యారు. ఇంతకీ దీదీ ఏం ప్రకటన చేశారు? ఆమె ఎందుకు అబాసుపాలైందంటే?

Mamata Banerjee: ఎప్పుడు బిజెపి పైనో.. మోడీ సర్కార్ పైనో సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో నిలిచే తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈసారి మాత్రం ఓ విచిత్రమైన ప్రకటన చేసి వార్తల్లో నిలిచారు. అందరి ముందు అబాసు పాలయ్యారు. ఇంతకీ దీదీ ఏం ప్రకటన చేశారు? ఆమె ఎందుకు అబాసుపాలైంది?  అనుకున్నారా..

గతంలో భారతదేశం తరుపున తొలిసారి అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగామి రాకేశ్ శర్మ పేరుకు బదులు రాకేష్ రోషన్ అని తప్పుగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ ప్రకటన చేసిన కొన్ని రోజుల తర్వాత.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం మరో విచిత్రమైన ప్రకటన చేశారు. తాజాగా ఇస్రో ప్రతిష్టాత్మకం ప్రయోగించిన చంద్రయాన్ 3 మిషన్ విజయవంతమైంది. దీంతో ప్రపంచ దేశాలు ఇస్రోను ప్రశంసలు ప్రశంసలతో ముంచెత్తెతున్నాయి. ఈ తరుణంలో  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా భారత అంతరిక్ష ప్రయోగాల గురించి మాట్లాడుతూ.. భారత మాజీ ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ చంద్రుడిపైకి వెళ్లారని వింత ప్రకటన చేశారు. ఈ ప్రకటన వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. 

ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో భారతదేశం మొదటి అంతరిక్ష యాత్ర చేసిందని గుర్తు చేసుకుంటూ.. మమతా బెనర్జీ ఇలా అన్నారు, "ఇందిరా గాంధీ చంద్రునిపైకి చేరుకున్నప్పుడు, అక్కడ నుండి హిందుస్థాన్ (భారతదేశం) ఎలా కనిపిస్తుందని ఆమె రాకేశ్‌ను అడిగారు. అతను ' సారే జహాన్ సే అచ్చా ' అని బదులిచ్చారు." అని దీదీ వ్యాఖ్యానించారు. తృణమూల్ ఛత్ర పరిషత్ (టీఎంసీపీ) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జరిగిన ర్యాలీలో దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు.మమతా బెనర్జీ ప్రకటనల ప్రకారం.. ఆమెకు భారత అంతరిక్ష ప్రయోగాలపై సరైనా అవగాహన లేదని తెలుస్తోంది. 

చంద్రయాన్-3 మిషన్ విజయవంతానికి ఇస్రో శాస్త్రవేత్తలను ప్రశంసిస్తూ రాకేశ్ శర్మకు బదులు రాకేష్ రోషన్ గా సంబోధించి మమతా బెనర్జీ గతంలో విమర్శలు ఎదుర్కొన్నారు. ఆగష్టు 23 న ఇస్రో తన ప్రతిష్టాత్మక మూడవ మూన్ మిషన్ చంద్రయాన్-3  ల్యాండర్ మాడ్యూల్ (LM) చంద్రుని ఉపరితలంపై తాకింది. ఈ ఘనతను సాధించిన నాల్గవ దేశంగా, దక్షిణ ప్రాంతంలో ల్యాండింగ్ విజయవంతంగా చేరుకున్న మొదటి దేశంగా చరిత్ర సృష్టించింది.  

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?