కేంద్రం అనుసరిస్తున్న వివక్షపై మమతా బెనర్జీ రెండు రోజుల నిరసన దీక్ష..

By Mahesh RajamoniFirst Published Mar 29, 2023, 3:40 PM IST
Highlights

Kolkata: ఎంజీఎన్ఆర్ఈజీఏ, ఇందిరా ఆవాస్ యోజన (గ్రామీణ్) నిధుల విడుదలను కేంద్రం నిలిపివేసిందని గతంలో ఆరోపించిన మమతా బెనర్జీ.. మ‌రోసారి కేంద్రం తీరుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ క్ర‌మంలోనే పశ్చిమ బెంగాల్ పట్ల కేంద్రం వివక్షకు వ్యతిరేకంగా బుధవారం రెండు రోజుల నిర‌స‌న దీక్ష‌కు దిగారు. ఈ నిర‌స‌న‌లో టీఎంసీ సీనియర్ నేతలు కూడా పాలుపంచుకుంటున్నారు.

Mamata Banerjee stages two-day protest: తమ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వ వివక్షాపూరిత వైఖరికి నిరసనగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కోల్ క‌తాలో రెండు రోజుల ధర్నాను బుధవారం ప్రారంభించారు. గురువారం సాయంత్రం వరకు ఈ నిరసన ధర్నా కొనసాగనుంది.

వివ‌రాల్లోకెళ్తే.. ఎంజీఎన్ఆర్ఈజీఏ, ఇందిరా ఆవాస్ యోజన (గ్రామీణ్) నిధుల విడుదలను కేంద్రం నిలిపివేసిందని గతంలో ఆరోపించిన మమతా బెనర్జీ.. మ‌రోసారి కేంద్రం తీరుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ క్ర‌మంలోనే పశ్చిమ బెంగాల్ పట్ల కేంద్రం వివక్షకు వ్యతిరేకంగా బుధవారం రెండు రోజుల నిర‌స‌న దీక్ష‌కు దిగారు. ఈ నిర‌స‌న‌లో టీఎంసీ సీనియర్ నేతలు కూడా పాలుపంచుకుంటున్నారు. టీఎంసీ సీనియ‌ర్ నాయ‌కులు ఫిర్హాద్ హకీం, అరూప్ బిశ్వాస్, సుబ్రతా బక్షి, సోవన్ దేవ్ చటోపాధ్యాయతో కలిసి మధ్యాహ్నం సమయంలో ఎర్ర రోడ్డులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ముందు ఉన్న వేదిక వద్దకు చేరుకుని దీక్ష‌ను ప్రారంభించారు. ఉపాధి హామీ, గృహనిర్మాణ, రోడ్డు శాఖల ఇతర పథకాల కోసం రాష్ట్రానికి కేంద్రం నిధులు నిలిపివేయడాన్ని ఎత్తిచూపారు. గురువారం సాయంత్రం వరకు ధర్నా కొనసాగనుంది.

బీజేపీ నేతృత్వంలోని కేంద్రం రాష్ట్రానికి ఉపాధి హామీ పథకం, గృహనిర్మాణ, రోడ్డు శాఖల ఇతర కార్యక్రమాలకు నిధులు విడుదల చేయలేదని బెంగాల్ సీఎం మంగళవారం ఆరోపించారు. "ఎంజీఎన్ఆర్ఈజీఏ, ఇందిరా ఆవాస్ యోజన (గ్రామీణ్) నిధుల విడుదలను కేంద్రం నిలిపివేసింది. అంతేకాకుండా ఓబీసీ విద్యార్థులకు స్కాలర్ షిప్ లను కూడా నిలిపివేసింది" అని తెలిపారు. ఈ ఏడాది చివరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 'పఠాశ్రీ-రాస్తాశ్రీ' పథకాన్ని ప్రారంభించిన మమతా బెనర్జీ గ్రామీణ రోడ్ల నిర్మాణానికి రూ.3.75 వేల కోట్ల మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. 

ఉపాధి హామీ పథకం కింద పెండింగ్ లో ఉన్న రూ.7,000 కోట్లకు పైగా నిధుల‌ను కేంద్రం విడుదల చేయలేదని, ఈ పథకం కింద పనులు పూర్తి చేయడంలో పశ్చిమబెంగాల్ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ రాష్ట్రం ప‌ట్ల వివ‌క్ష‌ను చూపుతున్నార‌ని కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. దీనికి వివ‌క్ష‌, రాజ‌కీయ అసూయలు కార‌ణం కావ‌చ్చున‌ని తాము భావిస్తున్నామని ఆమె అన్నారు. పశ్చిమ బెంగాల్ కు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాలేదనీ, ఈ ఏడాది బడ్జెట్ లో కూడా రాష్ట్రానికి పెద్ద‌కేటాయింపులు చేయ‌లేద‌ని మమతా బెనర్జీ ఆరోపించారు. బెంగాల్ పట్ల కేంద్రం చూపుతున్న వివక్షకు నిరసనగా ఈ నెల 29 నుంచి కోల్ కతాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఎదుట ముఖ్యమంత్రిగా ధర్నాను 30వ తేదీ సాయంత్రం వరకు కొనసాగిస్తానని చెప్పారు.
 

 

Hon'ble Chairperson Smt. leads a REMARKABLE DHARNA, fiercely protesting the Central Govt.'s indifference towards Bengal and fighting for people's rights.

Together, we shall win! pic.twitter.com/sJKQZAxTZl

— Banglar Trinamool (@TMC4Bengal_)
click me!