తల్లిని కోల్పోయిన బాధలో ఆయనున్నారు.. ఇప్పుడు పాత బకాయిల గురించి ఇబ్బంది పెట్టబోను

Published : Jan 03, 2023, 06:25 AM IST
తల్లిని కోల్పోయిన బాధలో ఆయనున్నారు.. ఇప్పుడు పాత బకాయిల గురించి ఇబ్బంది పెట్టబోను

సారాంశం

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం(MGNREGA) బకాయిల చెల్లింపు విషయంలో ప్రధాని మోడీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  తన తల్లిని కోల్పోయినందుకు వ్యక్తిగత దుఃఖంలో ఉన్న సమయంలో రాష్ట్ర ఆర్థిక బకాయిల గురించి ప్రధాని నరేంద్ర మోడీని ఇబ్బంది పెట్టబోనని అన్నారు.

ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. MNREGA బకాయిలను చెల్లింపులో ప్రధాని మోడీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.  ప్రధాని మోడీ గత వారం తన తల్లిని కోల్పోయినందుకు ఆయన దుఃఖంలో ఉన్నారనీ, ఈ సమయంలో మోడీని రాష్ట్ర బకాయిల గురించి ఇబ్బంది పెట్టబోనని సోమవారం అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం MNREGA బకాయిలను క్లియర్ చేయాలని అభ్యర్థిస్తూ బెనర్జీ అనేక సందర్భాల్లో ప్రధాని మోదీకి లేఖలు రాసినట్టు తెలిపారు. విలేకరుల సమావేశంలో బెనర్జీ మాట్లాడుతూ.. 'ఈ విషయమై తాను ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాననీ,ఇది వారికి శోకసమయం. తాను ఇప్పుడు ఇంకేమీ అడగ గలను అని పేర్కొన్నారు.  ప్రధాని తల్లి హీరాబెన్ మోదీ శుక్రవారం అహ్మదాబాద్‌లోని ఆసుపత్రిలో మరణించిన విషయం తెలిసిందే. 

అలాగే.. బిజెపిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. వారి భావజాలం మతం ప్రాతిపదికన వ్యక్తుల మధ్య తేడా ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష బీజేపీ, వామపక్షాల మధ్య అనుబంధం ఉందని మమత ఆరోపించారు. ‘ఇప్పుడు బీజేపీ - వామపక్షలు ఒక్కటయ్యాయి’ అని మమత సంచలన ప్రకటన చేసింది. అయితే.. ఈ ప్రకటనపై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్ట్ (సీపీఎం) ఎదురుదాడి చేసింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ఇలాంటి ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి రాజకీయంగా సహాయం చేయడానికి కాషాయ పార్టీ, వామపక్ష పార్టీల మధ్య రహస్య ఒప్పందం గురించి మమతా బెనర్జీ ఈ వ్యాఖ్య చేశారని పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుజన్ చక్రవర్తి పేర్కొన్నారు.
 
ఈ ఏడాది జరగనున్న పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధికార టీఎంసీ సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రచారానికి 'దీదీర్ సురక్ష కవచ్' అని పేరు పెట్టారు. ప్రచారం ప్రారంభంలో..రాష్ట్ర వ్యాప్తంగా TMC ప్రభుత్వంపై నిరాధారమైన పుకార్లు తొలగించడానికి రూపొంచామని  మమత అన్నారు. దేశంలో ఐక్యత, సమాఖ్య నిర్మాణాన్ని బలోపేతం చేయాలన్నారు. బీజేపీ సిద్ధాంతం మిమ్మల్ని ఒంటరిగా, ప్రజల మధ్య తేడాను క్రియేట్ చేస్తుందని ఆరోపించారు. వినయంగా ప్రజల మాట వినాలని మమతా బెనర్జీ పార్టీ కార్యకర్తలకు సూచించారు.

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, కవి కాజీ నజ్రుల్ ఇస్లాం పేరిట నజ్రుల్ మంచ్‌లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యక్రమానికి మమతా బెనర్జీ వచ్చారు. ఈ క్రమంలో మమత మాట్లాడుతూ.. 'మేము అందరినీ కలుపుకొని పోయే భావజాలానికి అనుచరులం. అందరినీ వెంట తీసుకెళ్లాలి. బీజేపీ సిద్ధాంతం మత ప్రాతిపదికన ప్రజల మధ్య వివక్ష చూపుతోంది. మీరు వినయంగా ప్రజల మాట వినాలి. రాష్ట్రంలో ప్రతిపక్ష బీజేపీ, వామపక్షాల మధ్య రహస్య పొత్తు ఉంది. ఇప్పుడు ‘రామ్, వామపక్షాలు’ ఒక్కటయ్యాయి. అసాంఘిక శక్తులను ఏరివేసేందుకు.. క్షేత్ర స్థాయిలో సరైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. పంచాయతీ స్థాయిలో నిఘా ఉంచేందుకు సరైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని ఫిర్యాదులను పరిశీలించేందుకు విచారణ యంత్రాంగం ఉంటుంది అని తెలిపారు. 

'బలమైన సమాఖ్య నిర్మాణాన్ని నిర్మించడమే లక్ష్యం'

ఈ ఏడాది చివర్లో పశ్చిమ బెంగాల్‌లో జరగనున్న పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు చేరువయ్యేందుకు ముఖ్యమంత్రి టిఎంసి జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, రాష్ట్ర అధ్యక్షుడు సుబ్రతా బక్షి సమక్షంలో ‘దీదీర్ సురక్షా కవచ్’ ప్రచారాన్ని ప్రారంభించారు. జనవరి 1న TMC ఏర్పడి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. దేశ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టింది.  

 

సీపీఎంపై టార్గెట్  

భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి రాజకీయంగా సహాయం చేయడానికి ..కాషాయ పార్టీ, వామపక్ష పార్టీల మధ్య రహస్య పొత్తు పెట్టుకున్నాయని మమతా బెనర్జీ వ్యాఖ్య చేశారని సుజన్ చక్రవర్తి పేర్కొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తరపున మమతా బెనర్జీ ఇలాంటి వాదనలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. హిందుత్వ బ్రిగేడ్, కమ్యూనిస్టులు సైద్ధాంతికంగా పరస్పరం వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు డబ్బు ఇవ్వడంలో అవకతవకలకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో, ప్రతిపక్ష బిజెపి, లెఫ్ట్ ఫ్రంట్ , కాంగ్రెస్ వేర్వేరుగా నిరసనలు చేసిన విషయం తెలిసిందే..  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?