మూడు నెలల పసికందును మూడో అంతస్తు నుంచి కిందకు విసిరేసిన తల్లి

By Rajesh KarampooriFirst Published Jan 3, 2023, 4:07 AM IST
Highlights

మానవత్వం సిగ్గుపడే ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వెలుగు చూసింది.  ఓ మహిళ తన మూడు నెలల పసికందును ఆస్పత్రిలోని మూడో అంతస్తు నుంచి కిందకు విసిరేసిందని ఆరోపించారు. నిందితురాలిని అరెస్టు చేసినట్లు ఎఫ్ డివిజన్ అదనపు పోలీసు కమిషనర్ పీపీ పిరోజియా తెలిపారు.

గుజరాత్‌లో మానవత్వం సిగ్గుపడే ఘటన వెలుగు చూసింది. ఓ తల్లి తన మూడు నెలల బిడ్డను మూడవ అంతస్తు నుండి కిందకు విసిరి చంపింది. అయితే.. ఆ బిడ్డ పుట్టినప్పటి నుండి అనారోగ్యంతో బాధపడుతున్నదనీ ఆ తల్లి చెప్పుతుంది.  ఈ హృదయ విదారక సంఘటన అహ్మదాబాద్‌లోని సివిర్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఆ తల్లిని సోమవారం అరెస్టు చేశారు.

అహ్మదాబాద్‌లోని అసర్వా ప్రాంతంలోని సివిల్ హాస్పిటల్‌లో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగిందని అదనపు పోలీసు కమిషనర్ పిపి పిరోజియా  తెలిపారు. మొదట నిందితురాలు తల్లి.. తన కూతురు కనిపించడం లేదనీ ఆరోపిస్తూ ఆసుపత్రి పాలకవర్గాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది. కాని సిసిటివి ఫుటేజీని తనిఖీ చేస్తే.. అసలు విషయం బహిర్గతమైంది.  చనిపోయిన అమ్మాయి పేరు అమ్రీన్ అని.. ఆ చిన్నారి గత రెండు వారాలుగా సివిల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతుందని తెలిపారు.  

ఈ ఘటనను ఏసీపీ పిరోజియా వెల్లడిస్తూ.. సీసీటీవీ ఫుటేజీలో నిందితురాలు తన కుమార్తెను గ్యాలరీకి తీసుకెళ్లి.. వచ్చేటప్పుడు  రిక్తహస్తాలతో తిరిగి రావడం కనిపించిందని తెలిపారు. ఆ తర్వాత గ్రౌండ్ ఫ్లోర్‌లో అమ్రీన్ మృతదేహాన్ని ఆస్పత్రి సిబ్బంది గుర్తించారు. విచారణ అనంతరం మహిళ తన నేరాన్ని అంగీకరించింది. ఈ విషయాన్ని బాలిక తండ్రి ఆదివారం షాహీబాగ్ పోలీస్ స్టేషన్‌లో తెలియజేసినట్లు తెలిపారు. అనంతరం ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. 

నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం..చనిపోయిన బాలిక పుట్టినప్పటి నుంచి పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంది. దీంతో ఆ చిన్నారిని వడోదరలోని ఎస్‌ఎస్‌జీ ఆస్పత్రిలో చేర్చారు. 24 రోజుల పాటు ఆమెను అక్కడ చేర్చారు. వడోదర వైద్యులు కలుషిత నీరు తాగడం వల్లే ఈ వ్యాధి వచ్చిందని చిన్నారి తండ్రి ఆసిఫ్ పోలీసులకు తెలిపారు. తర్వాత బాలిక పరిస్థితి విషమించడంతో, ఆమెను డిసెంబర్ 14 న నదియాడ్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అక్కడి నుంచి అహ్మదాబాద్‌లోని సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. బాలిక కడుపులోంచి పేగులో కొంత భాగం బయటకు వచ్చిందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.ప్రస్తుతం ఈ కేసులో నిందితుడైన తల్లి తన నేరాన్ని అంగీకరించింది. తన చిన్నారికి సరైన వైద్యం అందించలేని, కడు పేద కుటుంబమని అందుకే ఈ దారుణానికి ఒడిగట్టినందుకు నిందితురాలు తెలిపింది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

click me!