భవానీపూర్ ఉపఎన్నిక: చేతులెత్తేసిన బీజేపీ.. భారీ మెజార్టీతో మమత విక్టరీ

By Siva KodatiFirst Published Oct 3, 2021, 2:22 PM IST
Highlights

దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన భవావీపూర్ ఉపఎన్నికలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ విజయం సాధించారు. ఆమె తన సమీప బీజేపీ అభ్యర్ధి  ప్రియాంక టిబ్రివాల్‌పై 58,389 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. 
 

దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన భవావీపూర్ ఉపఎన్నికలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ విజయం సాధించారు. ఆమె తన సమీప బీజేపీ అభ్యర్ధి  ప్రియాంక టిబ్రివాల్‌పై 58,389 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. 

ఇద్దరు అభ్యర్ధుల మరణంతో  సంషేర్ ‌గంజ్, జాంగీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడ టీఎంసీ (tmc) అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో నందిగ్రామ్ నుండి తన  ప్రత్యర్ధి బీజేపీ అభ్యర్ధి సువేంధు అధికారి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో మమత బెనర్జీ ఓటమి పాలయ్యారు. అయినా ఆమె సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఆరు మాసాల్లో ఆమె ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.

బీజేపీ అభ్యర్ధి ప్రియాంక బిబ్రేవాల్ న్యాయవాది. ఇదే నియోజకవర్గంలో ఆమె సుదీర్ఘ కాలంగా నివసిస్తున్నారు. 2015లో జరిగిన మున్సిపల్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక ఓటమి పాలయ్యారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత చెలరేగిన హింసకు సంబంధించి ఆమె కోర్టుల్లో కేసులు దాఖలు చేసిన పిటిషనర్లలో  ఒకరు.

ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ మాసాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఘన విజయం సాధించింది. కానీ నందిగ్రామ్ లో ఆమె సువేంధు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు. గురువారం నాడు ఈ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో 57 శాతానికి పైగా ఓట్లు నమోదయ్యాయి. 

click me!