Bhabanipur bypoll: తొలి రౌండ్లలో మమత బెనర్జీ ఆధిక్యం

By narsimha lodeFirst Published Oct 3, 2021, 10:28 AM IST
Highlights

భవానీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. తొలి రౌండ్లలో టీఎంసీ అభ్యర్ధి, సీఎం మమత బెనర్జీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తన సమీప బీజేపీ అభ్యర్ధి ప్రియాంక టిబ్రియాల్ పై ఆమె ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్  (west bengal )రాష్ట్రంలోని భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి (Bhabanipur bypoll)జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టీఎంసీ అభ్యర్ధి, సీఎం మమత బెనర్జీ (Mamata Banerjee) తొలి రౌండ్లలో ఆధిక్యతలో ఉన్నారు.ఈ ఉప ఎన్నికల్లో మమత బెనర్జీ విజయం సాధించాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది.

మమత బెనర్జీపై బీజేపీ అభ్యర్ధిగా ప్రియాంక టిబ్రేవాల్ (Priyanka Tibrewal)పోటీ చేశారు. ఇద్దరు అభ్యర్ధుల మరణంతో  సంషేర్ ‌గంజ్, జాంగీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడ టీఎంసీ (tmc) అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో నందిగ్రామ్ నుండి తన  ప్రత్యర్ధి బీజేపీ అభ్యర్ధి సువేంధు అధికారి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో మమత బెనర్జీ ఓటమి పాలయ్యారు. అయినా ఆమె సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఆరు మాసాల్లో ఆమె ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.

బీజేపీ అభ్యర్ధి ప్రియాంక బిబ్రేవాల్ న్యాయవాది. ఇదే నియోజకవర్గంలో ఆమె సుదీర్ఘ కాలంగా నివసిస్తున్నారు. 2015లో జరిగిన మున్సిపల్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక ఓటమి పాలయ్యారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత చెలరేగిన హింసకు సంబంధించి ఆమె కోర్టుల్లో కేసులు దాఖలు చేసిన పిటిషనర్లలో  ఒకరు.

ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ మాసాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఘన విజయం సాధించింది. కానీ నందిగ్రామ్ లో ఆమె సువేంధు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు. గురువారం నాడు ఈ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో 57 శాతానికి పైగా ఓట్లు నమోదయ్యాయి. 


 

click me!