వివాహేతర సంబంధం... కట్టుకున్న భర్తను కన్నకొడుకుల సాయంతో చంపిన మహిళ

Arun Kumar P   | Asianet News
Published : Oct 03, 2021, 08:27 AM IST
వివాహేతర సంబంధం... కట్టుకున్న భర్తను కన్నకొడుకుల సాయంతో చంపిన మహిళ

సారాంశం

అక్రమ సంబంధం కారణంగా అయినవారి చేతిలోనే ఓ వ్యక్తి అతి దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. 

బెంగళూరు: అక్రమబంధాలు మానవ సంబంధాలను చంపేస్తున్నాయి. ఇటీవల కాలంలో అక్రమ సంబంధాల కారణంగా కట్టుకున్న భార్యను భర్త, భర్తను భార్య లేదంటే సొంత కుటుంబసభ్యులే తమవారిని అతి కిరాతకంగా హతమారుస్తున్న అనేక ఉదంతాలు బయటపడుతున్నాయి. ఇలా కుటుంబాలకు కుటుంబాలు అక్రమ సంబంధాల కారణంగా చిన్నాబిన్నం అవుతున్నాయి. అలాంటి ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది.

పోలీసుల కధనం ప్రకారం... కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా అచాపుర గ్రామానికి చెందిన వినోద్(45)-బిను(42) భార్యాభర్తలు. వీరికి వివేక్, విష్ణు సంతానం. పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా వుండేవారు. ఇద్దరు పిల్లలతో హాయిగా సాగుతున్న వీరి జీవితంలో అక్రమసంబంధం చిచ్చు పెట్టింది. 

వినోద్ కు ఓ మహిళతో పరిచయం ఏర్పడి అదికాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. మహిళ మోజులో పడిపోయిన కుటుంబాన్ని పట్టించుకోవడం మానేసాడు. అంతేకాదు ఆస్తులను అమ్మిమరి సదరు మహిళను డబ్బులివ్వడం ప్రారంభించాడు. ఈ విషయంలో వినోద్ కు భార్యా పిల్లలతో తరచూ గొడవలు జరుగుతుండేవి. 

read more  కేవలం రూ.5వేలకే మైనర్ బాలిక కన్యత్వం అమ్మకానికి... కన్నతల్లి కోసం

కుటుంబసభ్యులు ఎంత చెప్పినా తీరుమార్చుకోకుండా ఇటీవల మరో ప్రాపర్టీని అమ్మి పెద్దమొత్తంలో నగదును సదరు మహిళకు ఇచ్చాడు వినోద్. దీంతో ఇక అతడిలో మార్పు రాదని భావించిన భార్యాపిల్లలు దారుణ నిర్ణయం తీసుకున్నారు.  ఇద్దరు కొడుకులు, మరో ఇద్దరి బంధువులతో కలిసి వినోద్ హత్యకు భార్య బిను ప్రణాళికలు రచించింది.

భర్త ఇంట్లో నిద్రిస్తుండగా కొడుకు, బంధువులతో కలిసి బిను ఓ ఇనుపతీగను గొంతుకు బిగించింది. దీంతో అతడు ఊపిరాడక ప్రాణాలు వదిలాడు. ఆ తర్వాత అతని మృతదేహాన్ని కారులో అడవిలోకి తీసుకెళ్లారు. అక్కడ కారుని తగలబెట్టి ఆత్మహత్య చేసుకున్నట్లు అందరినీ నమ్మించారు. 

అయితే ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్న సమయంలో కుటుంబసభ్యులు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులను అనుమానం కలిగింది. దీంతో వారిని విచారించగా అసలు నిజం భయటపడింది. దీంతో వినోద్ ను చంపిన భార్య బిను, కొడుకులు వివేక్, విష్ణు, బంధువులు అశోక్, సంజయ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా అక్రమసంబంధం ఓ కుటుంబం మొత్తాన్ని చిన్నాబిన్నం చేసింది. 
 

PREV
click me!

Recommended Stories

Indian Army Romeo Force Destroys: గడ్డ కట్టే మంచులో మన ఇండియన్ ఆర్మీ| Asianet News Telugu
Tourists Enjoy New Year’s First Snow in Chamba: మంచు కొండల్లో న్యూఇయర్ వేడుకలు | Asianet News Telugu