ఎఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బాధ్యతల స్వీకరణ:హాజరైన సోనియా,రాహుల్

Published : Oct 26, 2022, 11:02 AM ISTUpdated : Oct 26, 2022, 12:55 PM IST
 ఎఐసీసీ  అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బాధ్యతల స్వీకరణ:హాజరైన సోనియా,రాహుల్

సారాంశం

ఎఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే  ఇవాళ బాధ్యతలు స్వీకరించారు.  కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక  అధ్యక్షురాలు  సోనియాగాంధీ,రాహుల్ గాంధీలు  ఈ  కార్యక్రమంలో పాల్గొన్నారు.

న్యూఢిల్లీ: ఎఐసీసీ  అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే  బుధవారం నాడు ప్రమాణం చేశారు. ఎఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో  శశిథరూర్ పై మల్లికార్జున ఖర్గే  విజయం సాధించిన విషయం  తెలిసిందే. మల్లికార్జున  ఖర్గే   ఎఐసీసీ  అధ్యక్షుడిగా ఎన్నికైనట్టుగా  రిటర్నింగ్ అధికారి  మధుసూధన్  మిస్త్రీ  ధృవపత్రాన్ని  అందించారు. అనంతరం  మల్లికార్జునఖర్గేకు ఎఐసీసీ  తాత్కాలిక  అధ్యక్షురాలు సోనియాగాంధీకి  మల్లికార్జునఖర్గేకు  బాధ్యతలు  అప్పగించారు.

ఎఐసీసీ  అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గే ముందు  అనేక సవాళ్లున్నాయి. ఈ ఏడాదిలో హిమాచల్  ప్రదేశ్ ,  గుజరాత్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు  2024లో మోడీ సర్కార్  ను  గద్దె దిం,చకపోతే కాంగ్రెస్  పార్టీ  మరింత కష్టాల్లోకి  వెళ్లే  అవకాశాలు  లేకపోలేదని  రాజకీయ విశ్లేషకులు  అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్  పార్టీని  సంస్థాగతంగా  బలోపేతం చేసేందుకు కాంగ్రెస్  పార్టీ  నాయకత్వం  భావించింది.

రాజస్థాన్ లో  నిర్వహించిన చింతన్ శిబిర్ లో పలు  కీలక నిర్ణయాలను అమలు చేయాలని ఖర్గే భావిస్తున్నారు.50  ఏళ్లలోపు వారికే పార్టీలో  50  శాతం పదవులను రిజర్వ్  చేయనున్నారు. 214 ఏళ్ల తర్వాత కాంగ్రెస్  పార్టీ  అధ్యక్షుడిగా గాంధీయేతర కుటుంబానికి చెందిన మల్లికార్జున ఖర్గే  బాధ్యతలు చేపట్టారు.  సాధారణ  కార్యకకర్త  నుండి ఎఐసీసీ  అధ్యక్ష పదవిని ఖర్గే దక్కించుకున్నారు. నిన్న మాజీ  ప్రధాని మన్మోహన్ సింగ్  తో  ఖర్గే భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం రాజ్ ఘాట్  లో మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు.

 ఇందిరా గాంధీ, నెహ్రు రాజీవ్ గాంధీ స్మార చిహ్నలను  కూడ సందర్శించి  నివాళులర్పించారు.  కాంగ్రెస్ పార్టీ ముందున్న సవాళ్లను  స్వీకరించేందుకు  తాను సిద్దంగా  ఉన్నట్టుగా  మల్లికార్జునఖర్గే చెప్పారు. రెండు వారాల్లోనే  హిమాచల్ ప్రదేశ్  అసెంబ్లీకి  ఎన్నికలు  జరగనున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్  పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే ఖర్గే ముందున్న తక్షణ కర్తవ్యం.అదే విధంగా గుజరాత్  రాష్ట్ర అసెంబ్లీకి  కూడ ఎన్నికలు జరగనున్నాయి.  ఈ రెండు  రాష్ట్రాల  ఎన్నికల  ఫలితాలు  డిసెంబర్  మాసంలో వెలువడనున్నాయి. వచ్చే ఏడాది  ఛత్తీస్ ఘడ్ ,రాజస్థాన్ సహా  తొమ్మిది రాష్ట్రాల  అసెంబ్లీలకు  ఎన్నికలు జరుగుతాయి., 

alsor ead:ఎఐసీసీ అధ్యక్ష ఎన్నికలు:మల్లికార్జున ఖర్గే గెలుపు

గాంధీయేతర  కుటుంబానికి చెందిన సీతారాం కేసరి  1998లో పనిచేశాడు.సీతారాం  కేసరి తర్వాత ఖర్గే  గాంధీయేతర  కుటుంబం నుండి పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు  స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం  చేసేందుకు  గాను  జీ 23 నేతలు చేసిన డిమాండ్ల నేపథ్యంలో రాజస్థాన్ చింతన్ శిబిర్ లో కీలక  నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం