చారిత్రాత్మక ఘట్టాలకు సజీవ సాక్ష్యం: పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఖర్గే

Published : Sep 19, 2023, 12:50 PM IST
చారిత్రాత్మక ఘట్టాలకు సజీవ సాక్ష్యం: పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఖర్గే

సారాంశం

పాత పార్లమెంట్ భవనం అనేక  ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచిందని  రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే చెప్పారు.

న్యూఢిల్లీ: పాత పార్లమెంట్ భవనం అనేక  చారిత్రాత్మక ఘట్టాలకు  సాక్ష్యంగా నిలిచిందని  రాజ్యసభలో  విపక్ష నేత  మల్లికార్జున ఖర్గే చెప్పారు.

భారత పార్లమెంటరీ వారసత్వంపై ప్రత్యేక  కార్యక్రమం నిర్వహించారు. పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో మంగళవారంనాడు కార్యక్రమంలో  రాజ్యసభలో  విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రసంగించారు.  భారత ప్రథమ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రు  సేవలను  కాంగ్రెస్ అగ్రనేత మల్లికార్జున ఖర్గే గుర్తు చేసుకున్నారు. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ నెహ్రు ట్రిస్ట్ విత్ డెస్టినీ  ప్రసంగాన్ని ప్రస్తావించినందరుకు  ప్రధానికి ఖర్గే ధన్యావాదాలు తెలిపారు.  పాత పార్లమెంట్ లోని సెంట్రల్ హల్ కు చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉందని  ఖర్గే చెప్పారు. రాజ్యాంగ సభ ఈ హాల్ లోనే మన రాజ్యాంగాన్ని రూపొందించిన విషయాన్ని  మల్లికార్జున ఖర్గే గుర్తు చేశారు. అంతకుముందు పార్లమెంట్  పాత భవనం వద్ద ఎంపీల ఫోటో సెషన్ జరిగింది.ఈ సెషన్ లో  ప్రధాని మోడీతో పాటు పలు పార్టీల ప్రజా ప్రతినిధులు ఫోటోలు దిగారు.ఈ కార్యక్రమం తర్వాత  సెంట్రల్ హాల్ లో సమావేశం ప్రారంభమైంది.  పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో  ఎంపీలతో  ప్రధాని మోడీ నవ్వుతూ  పలకరించారు. 

ఇవాళ మధ్యాహ్నం పార్లమెంట్ కొత్త భవనంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.  పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాల్ ఇవాళ నిర్వహించిన సమావేశం చివరిది.  ఖర్గే ప్రసంగం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు.  


 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?