‘వెళ్లే వాళ్లను ఆపం..’ జితిన్ బీజేపీలో చేరికపై ఖర్గే...

By AN TeluguFirst Published Jun 9, 2021, 4:39 PM IST
Highlights

కాంగ్రెస్ సీనియర్ నేత జితిన్ ప్రసాద బీజేపీలో చేరడం మీద రాజ్యసభ కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే సూటిగా స్పందించారు. ‘వెళ్లే వాల్లను వెళ్లనీయండి. మేము వారిని ఆపం’ అని ఖర్గే వ్యాఖ్యనించారు. బీజేపీలో చేరాలనేది ఆయన నిర్ణయం అని, ఆయనకు ఇక్కడ (కాంగ్రెస్) కూడా మంచి భవిష్యత్తు ఉందని అన్నారు. 

కాంగ్రెస్ సీనియర్ నేత జితిన్ ప్రసాద బీజేపీలో చేరడం మీద రాజ్యసభ కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే సూటిగా స్పందించారు. ‘వెళ్లే వాల్లను వెళ్లనీయండి. మేము వారిని ఆపం’ అని ఖర్గే వ్యాఖ్యనించారు. బీజేపీలో చేరాలనేది ఆయన నిర్ణయం అని, ఆయనకు ఇక్కడ (కాంగ్రెస్) కూడా మంచి భవిష్యత్తు ఉందని అన్నారు. 

అయినప్పటికీ ఆయన పార్టీ మారాలని నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమని అన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్న నేపథ్యంలో రాహుల్ సన్నిహితుడుగా పేరున్న జితిన్ ప్రసాద పార్టీ మారడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ లో ఉండి ప్రజలకు సేవ చేయలేకపోతున్నందునే బీజేపీలో చేరుతున్నానని, జాతీయ పార్టీగా ప్రస్తుతం బీజేపీయే ఉందని జితిన్ ప్రసాద బీజేపీలో చేరిన అనంతరం వ్యాఖ్యానించారు. 

కాగా, ఉత్తరప్రదేశ్ ఎన్నికల వేళ .. కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన యువ నేత జితిన్ ప్రసాద బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. బుధవారం న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో రైల్వే మంత్రి పీయుష్ గోయల్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన జితిన్ ప్రసాద గత ఏడాది జులైలో బ్రాహ్మణ చేతనా పరిషత్ నెలకొల్పి ఆ సామాజిక వర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన జితేంద్ర ప్రసాద తనయుడే జితిన్. 2001లో యూత్ కాంగ్రెస్‌లో చేరిన జితేంద్ర 2004 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని షాజహాన్‌పూర్‌ నుంచి పోటీ చేశారు. యూపిఏ హయాంలో మన్మోహన్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీతో తనకు మూడు తరాల అనుబంధం ఉందన్నారు. బీజేపీ ఒక్కటే జాతీయ పార్టీ అని, మిగతా వన్నీ ప్రాంతీయ పార్టీలేనని జితిన్ ప్రసాద మీడియాతో వ్యాఖ్యానించారు. 
 

click me!