
Malaika Arora: బాలీవుడ్ నటి, మోడల్ మలైకా అరోరా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆమె ప్రయాణిస్తోన్న కారు ముంబై శివారులో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మలైకకు గాయాలయ్యాయి. దీంతో ఆమెను నేవీ ముంబైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని.. చికిత్స అందుతుందని వైద్యులు వెల్లడించారు.
ప్రమాదంపై ఖొపోలీ పోలీస్ స్టేషన్ అధికారులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. నటి మలైకా అరోరా శనివారం మధ్యాహ్నం ఓ ఫ్యాషన్ ఈవెంట్ లో పాల్గొని తిరిగి వస్తుండగా.. ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేలో కారులోప్రయాణిస్తుండగా.. ఖలాపూర్ టోల్ ప్లాజా సమీపంలో కారు ప్రమాదానికి గురైందని పోలీసులు తెలిపారు. హైవేపై మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొని, అన్నీ దెబ్బతిన్నాయి.
ప్రమాదం తర్వాత మిగతా వాహనాలు వెళ్లిపోగా, గాయపడ్డ మలైకను సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. మలైకకు గాయాలయ్యాయని, ప్రస్తుతం ఆమె ఆస్పత్రికి తరలించారని, కోలుకున్న తర్వాత స్టేట్మెంట్ తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై విచారణ జరిపి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయనున్నామనీ పోలీసులు చెప్పారు.
ఈ రోడ్డు ప్రమాదంలో మలైకా నుదిటిపై గాయాలైనట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, పలు పరీక్షల అనంతరం రేపు ఉదయం డిశ్చార్జ్ అవుతారని అపోలో హాస్పిటల్ వైద్యులు తెలిపారు. ఈ తరుణంలో .. మలైకా అరోరా సోదరి అమృతా అరోరా మీడియాతో మాట్లాడుతూ.. మలైకా ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని వెల్లడించారు.
ముంబయి-పుణే ఎక్స్‌ప్రెస్ హైవేపై మూడు కార్లు ఒక దానిని మరొకటి ఢీకొన్న ఘటనలో మలైకా గాయపడినట్లు పేర్కొంటున్నారు. ఈ ప్రమాద సమయంలో మలైకా తన డ్రైవర్, బాడిగార్డ్ తో కలిసి ప్రయాణిస్తున్నారు. అయితే.. ప్రమాదం జరిగిన సమయంలో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న మహారాష్ట్ర నవనిర్మాన్ సేన (MNS) కు చెందిన ఓ నాయకుడు ఆమెను తన కారులో ముంబైకి తీసుకెళ్లారని సిబ్బంది పేర్కొంటున్నారు.
Malaika Arora: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా.. ఆసుపత్రికి తరలింపు.. https://telugu.asianetnews.com/national/malaika-arora-injured-in-car-accident-admitted-to-hospital-mumbai-r9q8yk