బిజేపీతో పొత్తు పెట్టుకోవడమంటే.. విషం తాగినట్టే.. మెహబూబా ముఫ్తీ

First Published Jul 30, 2018, 3:21 PM IST
Highlights

ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడమనేది విషం తాగడతంతో సమానం. నేను రెండు సంవత్సరాల రెండు నెలల పాటు ఆ బాధను భరించాను’ అని ముఫ్తీ అన్నారు.

జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ.. బిజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజేపీతో పొత్తు పెట్టుకోవడం అంటే.. విషం తాగడంతో సమానమని ఆమె అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో బిజేపీతో పొత్తుపెట్టుకొని ఆమె సీఎం కుర్చీ ఎక్కారు. అయితే.. ఇటీవల వారు పొత్తు నుంచి బయటకువచ్చారు.

‘వాజ్‌పేయీ హయాంలో భాజపాతో మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే మళ్లీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు అంగీకరించాం. కానీ ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడమనేది చాలా కష్టమైన నిర్ణయం. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడమనేది విషం తాగడతంతో సమానం. నేను రెండు సంవత్సరాల రెండు నెలల పాటు ఆ బాధను భరించాను’ అని ముఫ్తీ అన్నారు. శనివారం పీడీపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు.

భాజపాతో చేతులు కలపడమనేది ఒక కప్పు విషం తీసుకోవడమేనని అన్నారు. పీడీపీకి భాజపా మద్దతు ఉపసంహరించుకోవడంతో జమ్ముకశ్మీర్‌లో ముఫ్తీ ప్రభుత్వం పడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో గవర్నర్‌ పాలన నడుస్తోంది. అప్పటి నుంచి ముఫ్తీ ప్రతి సందర్భంలోనూ భాజపాపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. పీడీపీను ముక్కులు చేసేందుకు ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇటీవల ఆమె భాజపాను హెచ్చరించారు. తమ పార్టీలో చీలిక తెచ్చేందుకు భాజపా ప్రయత్నిస్తే కశ్మీర్‌ ప్రజలకు భారత ప్రజాస్వామ్యంపైనే నమ్మకం పోతుందని మండిపడ్డారు.

click me!