ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం, రంగంలోకి 26 ఫైరింజన్లు

By Siva KodatiFirst Published Jan 14, 2020, 12:52 PM IST
Highlights

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లారెన్స్ రోడ్డులో ఉన్న ఓ చెప్పుల తయారీ యూనిట్‌లో మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు.

Also Read:న్యూఢిల్లీలో అగ్నిప్రమాదం: కూలిన భవనం, శిథిలాల కింద పలువురు

26 ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయకచర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు జరిగినట్లు సమాచారం అందలేదు. ఘటన సమయంలో భవనంలో ఎంతమంది ఉన్నారన్న దానిపై స్పష్టత లేదు.

Also Read:ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. దగ్ధమవుతున్న రెండు పరిశ్రమలు

కాగా గత నెల ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్ 8న ఆనాజ్‌మండీ ప్రాంతంలో ఓ ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్ తయారు చేసే ఆ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో 37 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో హీటర్లు వేసుకుని నిద్రపోవడంతో షార్ట్ సర్క్యూట్ జరగడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ధ్రువీకరించారు. 

click me!