15 ఏళ్ల కూతురిని బలవంతంగా తన లవర్‌తో పెళ్లి చేసిన తల్లి.. ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు

Published : Nov 12, 2022, 04:56 AM IST
15 ఏళ్ల కూతురిని బలవంతంగా తన లవర్‌తో పెళ్లి చేసిన తల్లి.. ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు

సారాంశం

మహారాష్ట్ర పూణెలో దారుణం జరిగింది. తన లవర్‌ సంతోషంగా ఉండాలని బిడ్డను ఎరగా వేసింది. 15 ఏళ్ల తన బిడ్డ.. 28 ఏళ్ల తన లవర్‌ను పెళ్లి చేసుకోవాలని బెదిరించింది. నవంబర్ 6న ఆ బాలిక సదరు యువకుడిని పెళ్లి చేసుకుంది.   

న్యూఢిల్లీ: ఆ తల్లి సమాజం సిగ్గు పడే పని చేసింది. పేగు పంచుకుని బిడ్డ జీవితాన్నే అంధకారంలోకి నెట్టేసింది. తనకంటే వయసులో చిన్నవాడైన పురుషుడితో సంబంధం పెట్టుకుంది. ఆ సంబంధాన్ని తన బిడ్డ వరకూ తెచ్చుకుంది. తన లవర్‌ను పెళ్లి చేసుకోవాలని బిడ్డపై ఒత్తిడి తెచ్చింది. పెళ్లి చేసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంానని బెదిరించింది. ఈ బెదిరింపులతోనే తన లవర్‌తో 15 ఏళ్ల కూతురి పెళ్లి చేసింది. బలవంతంగా ఈ పెళ్లి జరిగిన తర్వాత ఆ యువకుడు సదరు బాధితురాలితో లైంగిక సంబంధాన్ని ప్రారంభించినట్టు తెలిసింది. మహారాష్ట్రలోని పూణెలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు శుక్రవారం తెలిపారు.

ఈ కేసులో 36 ఏళ్ల మహిళ, 28 ఏళ్ల తన లవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పోక్సో యాక్ట్, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కిింద కేసులు పెట్టారు. 15 ఏళ్ల బాలిక తాను ఎదుర్కొంటున్న సమస్యలను తన క్లాస్‌మేట్‌కు తెలియజేయడం వల్ల విషయం బయటకు వచ్చింది. ఓ సామాజిక సేవకురాలినీ అలర్ట్ చేశారని పోలీసులు తెలిపారు. సదరు మహిళతో ఉంటున్న యువకుడు దూరపు బంధువు అని తేలిందని వివరించారు. 

Also Read: మధ్యాహ్న భోజనం తిన్న 200 మంది విద్యార్ధులకు అస్వస్థత... బల్లి పడిన ఆహారమే కారణమా..?

తన లవర్‌తో పెళ్లి చేసుకోబోనని కూతురు మొండికేస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని 36 ఏళ్ల తల్లి బెదిరింపులు చేసింది. నవంబర్ 6వ తేదీన ఆ బాలిక సదరు యువకుడితో అహ్మద్‌నగర్‌లోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఆ యువకుడు బలవంతంగానే ఆ బాలికతో లైంగిక సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు మొదలు పెట్టినట్టు వివరించారు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్