కాశ్మీరీ పండిట్లకు మహారాష్ట్ర అండ‌గా ఉంటుంది - సీఎం ఉద్ధవ్ ఠాక్రే

Published : Jun 05, 2022, 04:10 AM ISTUpdated : Jun 05, 2022, 04:13 AM IST
కాశ్మీరీ పండిట్లకు మహారాష్ట్ర అండ‌గా ఉంటుంది -  సీఎం ఉద్ధవ్ ఠాక్రే

సారాంశం

కాశ్మీర్ పండిట్లకు మహారాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ టాక్రే తెలిపారు. వారి కోసం తమ ప్రభుత్వం సాధ్యమైన అన్ని పనులూ చేస్తుందని హామీ ఇచ్చారు. 

కశ్మీర్ లో హిందువులను ల‌క్ష్యంగా చేసుకొని హత్యలు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. కాశ్మీరీ పండిట్ల కోసం తమ ప్రభుత్వం చేయగలిగినదంతా చేస్తుందని అన్నారు. కాశ్మీరీ పండిట్లను తాను వదిలిపెట్టబోనని సీఎం హామీ ఇచ్చారు. ఈ మేర‌కు ఆయ‌న వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడారు. కశ్మీరీ పండిట్ల కోసం సాధ్య‌మైన అన్ని ప‌నులు చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. మహారాష్ట్ర వారికి అండగా నిలుస్తుందని, వారికి సహాయం చేయడానికి అన్ని విధాలుగా కృషి చేస్తుందని థాకరే చెప్పారు. 

కాశ్మీర్ లో హిందువులను లక్ష్యంగా చేసుకుని హత్య చేసిన కేసులు ఇటీవలి కాలంలో పెరిగాయి. లోయలో పనిచేస్తున్న హిందూ వలస కార్మికులు, కాశ్మీరీ పండిట్లను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ వారంలోనే జమ్మూలోని సాంబా జిల్లాకు చెందిన ఒక మహిళా టీచర్, రాజస్థాన్ కు చెందిన ఒక బ్యాంకు మేనేజర్, బీహార్ కు చెందిన ఒక వలస కార్మికుడిని కాల్చి చంపారు.

Agnipath : ‘అగ్నిపథ్’ స్కీమ్ ను ప్ర‌ధానికి వివ‌రించిన సైనికాధికారులు.. ఇంత‌కీ ఆ స్కీమ్ ఏంటంటే ?

ప్రాణాలకు భయపడుతూ కశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్న హిందువులు తమను జమ్మూకు తరలించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, ఆర్అండ్ఏడబ్ల్యూ చీఫ్ సామంత్ గోయల్తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్న వారిని లోయలోని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

ఇదే విష‌యంలో ఉద్దవ్ ఠాక్రే కుమారుడు, మంత్రి ఆదిత్య ఠాక్రే కూడా శ‌నివారం మీడియాతో మాట్లాడారు. కాశ్మీర్ లో పరిస్థితి తీవ్రంగా ఆందోళనకరంగా ఉందని అన్నారు. ‘ఈ కాలంలో కూడా పరిస్థితి మళ్లీ పునరావృతం కావడం దురదృష్టకరం. కాశ్మీరీ పండిట్ల రక్షణకు కేంద్రం బలమైన చర్యలు తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాము ’’ అంటూ ఆయన పేర్కొన్నారు. కాగా కాశ్మీర్ పండిట్ల విషయంలో బీజేపీ పై శివ‌సేన గురువారం కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. కేంద్ర ప్రభుత్వం రక్షించలేకపోయిందని ఆరోపించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించాలని శివసేన తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది. 1990లలో కాశ్మీరీ పండిట్ల స్థానభ్రంశంపై కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలను లక్ష్యంగా చేసుకున్న బీజేపీ ఇప్పుడు తమ పాలనలో కాశ్మీర్‌లో జరుగుతున్న వరుస హత్యలకు జవాబుదారీగా ఉండాలని పేర్కొంది.

యూపీ కెమిక‌ల్ ఫాక్ట‌రీలో పేలుడు.. 12కి చేరిన మృతుల సంఖ్య‌.. కొన‌సాగుతున్న స‌హాయ‌క చ‌ర్య‌లు

జమ్మూ కాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి నేరుగా కేంద్రం పాలనలో ఉంచినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని శివసేన రాజ్య‌స‌బ ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. కాశ్మీర్‌లోని పండిట్‌లు, సిక్కులు, ముస్లింలను ప్రభుత్వం రక్షించలేకపోతోందని తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు కురిపించారు. “ కశ్మీరీ పండిట్లు, సైనికులు, ముస్లిం పోలీసు అధికారులు చంపబడుతున్నారు..  కానీ ప్రభుత్వం వారిని రక్షించలేకపోతోంది. ప్రధానమంత్రి, హోంమంత్రి రాజకీయాలు, ఎన్నికలలో నిమగ్నమై ఉన్నారు. కశ్మీర్‌లో పరిస్థితిపై వారు దృష్టి సారించాలి. దురదృష్టవశాత్తూ, రాజకీయాలు, ప్రత్యర్థులపై దాడులు, ప్రత్యర్థులపై కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేయడంతో వారు బిజీగా ఉన్నందున కశ్మీరీలలో ఆగ్రహాన్ని చూడలేకపోతున్నారు” అని రౌత్ విమర్శించారు. 
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?