'మహా ప్రభుత్వ' ఏర్పాటు కేసు: బలపరీక్షపై రేపు తేల్చనున్న సుప్రీం

By telugu teamFirst Published Nov 24, 2019, 12:37 PM IST
Highlights

మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్‌ ముఖ్యమంత్రిగా, అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా ఏర్పడిన ప్రభుత్వాన్ని సవాల్‌ చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ శనివారం సాయంత్రం సుప్రీం కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశాయి. దీన్ని అత్యవసరంగా విచారణ జరపవలిసిన పిటిషన్ గా సుప్రీమ్ దీన్ని పరిగణించింది. దీనిపై ఇందాక సుప్రీమ్ విచారణ ముగిసింది.

న్యూ ఢిల్లీ: మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్‌ ముఖ్యమంత్రిగా, అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా ఏర్పడిన ప్రభుత్వాన్ని సవాల్‌ చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ శనివారం సాయంత్రం సుప్రీం కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశాయి. దీన్ని అత్యవసరంగా విచారణ జరపవలిసిన పిటిషన్ గా సుప్రీమ్ దీన్ని పరిగణించింది. దీనిపై ఇందాక సుప్రీమ్ విచారణ ముగిసింది. కేసు రేపటికి వాయిదా పడింది. 

గవర్నర్ లేఖను, ఎన్సీపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలుపుతూ గవర్నర్ కు ఇచ్చిన లేఖను సుప్రీమ్ కోర్టుకు సమర్పించాలని ఎస్జీని సుప్రీమ్ కోర్ట్ ఆదేశించించింది. రేపు ఉదయం 10.30కు ఈ కేసును తిరిగి విచారించనున్నట్టు సుప్రీమ్ వివరించింది. 

Also read: మహా'క్యాంపు' : రిసార్ట్ రాజకీయాలకు తెరతీసిన పార్టీలు

కోర్ట్ తీర్పు కోసం వాదనలు వినడానికి అరగంట ముందుగానే, కోర్ట్ రూమ్ పూర్తిగా కిక్కిరిసి పోయింది. కేంద్రం తరుఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తుండగా, కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీల తరుఫున అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. కర్ణాటకలో ఏర్పడ్డ యెడ్డీ సర్కారుకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ తరుఫున  అప్పుడు కూడా అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. 

కపిల్ సిబాల్ వాదనలు వినిపిస్తూ, కర్ణాటక జడ్జిమెంట్ ను గుర్తు చేసారు. బీజేపీకి గనుక మెజారిటీ ఉంటె వెంటనే బలనిరూపణకు వెళ్లాలని సుప్రీమ్ కోర్టుకు విన్నవించారు. కర్ణాటకలో మాదిరిగా వీడియో రికార్డింగ్ జరపాలని, మూజువాణి ఓటుతో కాకుండా, సీక్రెట్ బాలట్ తో కాకుండా బాల నిరూపణ అసెంబ్లీలో జరగాలని అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు. 

Also read: మహారాష్ట్రలో అసలు ఎం జరుగుతుంది? శరద్ పవార్ తో బీజేపీ ఎంపీ భేటీ

దానికి పూర్వం, ప్రభుత్వం తరుపున వాదనలు వినిపిస్తూ ఎస్జీ హై కోర్టుకు ఈ కేసును బదిలీ చేయమని కోరగా, సుప్రీమ్ కోర్ట్ ఆ వాదనను తోసిపుచ్చింది. అంతేకాకుండా గవర్నర్ చర్యలను ప్రశ్నించలేమని ప్రభుత్వం తన వాదనలు వినిపించగా జడ్జీలు మాత్రం ఆ విషయాల గురించి ఇప్పుడు చర్చలు అవసరం లేదని, అవన్నీ ముగిసిపోయిన అంశాలని, కేవలం  

జస్టిస్ రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం దీనిపై విచారణ జరపనుంది. ఈ రిట్ పిటిషన్ లో ఫడ్నవీస్ కు బాల నిరూపణ కోసం ఇచ్చిన వారం రోజుల గడువును కూడా సవాల్ చేసారు. వారం పాటు గడువు ఇస్తే ఎమ్మెల్యేలతో బేరసారాలు జరిపే ఆస్కారం ఉంటుందని, అది రాజ్యంగా విరుద్ధమని వారు ఆ సదరు పిటిషన్ లో కోరారు. 

అక్టోబర్‌ 24న వెలువడిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏపార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని సంగతి తెలిసిందే. అయితే, బీజేపీ-శివసేన దోస్తీ తెగదెంపులు కావడంతో.. కాంగ్రెస్‌, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన అంతా రెడీ చేసుకున్న టైములో వారికి ఊహించని షాక్‌ తగిలింది. 

ఎన్సీపీ సీనియర్‌ నేత అజిత్‌ పవార్‌ మద్దతుతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభ పక్షనేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రమాణ స్వీకారం చేశారు.  డిప్యూటీ సీఎంగా శరద్ పవార్ అన్నకొడుకు అజిత్‌ పవార్‌ ప్రమాణం చేశారు.

click me!