మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటును సవాల్ చేస్తూ సుప్రీం లో రిట్ పిటిషన్... మరికాసేపట్లో విచారణ

By telugu team  |  First Published Nov 24, 2019, 10:23 AM IST

దేవేంద్ర ఫడ్నవిస్‌ ముఖ్యమంత్రిగా, అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా ఏర్పడిన ప్రభుత్వాన్ని సవాల్‌ చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ శనివారం సాయంత్రం సుప్రీం కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశాయి


మహారాష్ట్ర రాజకీయాలు హస్తినకు చేరాయి. దేవేంద్ర ఫడ్నవిస్‌ ముఖ్యమంత్రిగా, అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా ఏర్పడిన ప్రభుత్వాన్ని సవాల్‌ చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ శనివారం సాయంత్రం సుప్రీం కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశాయి. దీన్ని అత్యవసరంగా విచారణ జరపవలిసిన పిటిషన్ గా దీన్ని పరిగణించింది. దీనిపై ఇంకాసేపట్లో సుప్రీమ్ కోర్ట్ విచారణ జరపనుంది. 

Also read: మహా'క్యాంపు' : రిసార్ట్ రాజకీయాలకు తెరతీసిన పార్టీలు

Latest Videos

జస్టిస్ రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం దీనిపై విచారణ జరపనుంది. ఈ రిట్ పిటిషన్ లో ఫడ్నవీస్ కు బాల నిరూపణ కోసం ఇచ్చిన వారం రోజుల గడువును కూడా సవాల్ చేసారు. వారం పాటు గడువు ఇస్తే ఎమ్మెల్యేలతో బేరసారాలు జరిపే ఆస్కారం ఉంటుందని, అది రాజ్యంగా విరుద్ధమని వారు ఆ సదరు పిటిషన్ లో కోరారు. 

అక్టోబర్‌ 24న వెలువడిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏపార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని సంగతి తెలిసిందే. అయితే, బీజేపీ-శివసేన దోస్తీ తెగదెంపులు కావడంతో.. కాంగ్రెస్‌, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన అంతా రెడీ చేసుకున్న టైములో వారికి ఊహించని షాక్‌ తగిలింది. 

ఎన్సీపీ సీనియర్‌ నేత అజిత్‌ పవార్‌ మద్దతుతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభ పక్షనేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రమాణ స్వీకారం చేశారు.  డిప్యూటీ సీఎంగా శరద్ పవార్ అన్నకొడుకు అజిత్‌ పవార్‌ ప్రమాణం చేశారు.

మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు  మేజిక్ ఫిగర్ 145. బీజేపీకి ఇంకో 40 మంది సభ్యుల మద్దతు అవసరం. ఎన్సీపీలో అజిత్‌ వెంట ఉన్న 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని వార్తలు వస్తున్నాయి. కానీ ఎన్సీపీ శాసన సభ్యులంతా తమకు మద్దతు తెలుపుతున్నారని, ఆ పార్టీకి ఇక శరద్‌ పవార్‌ ఒక్కరే మిగిలి ఉన్నారని బీజేపీ సంచలన వ్యాఖ్యలు చేసింది. 

Also read: కర్ణాటక గౌడలకు మహారాష్ట్ర పవార్ లకు చాలా దగ్గరి పోలిక

నిన్న సాయంత్రం శరద్ పవార్ పిలిచినా భేటీకి నలుగురు మినహా దాదాపుగా అందరూ ఎన్సీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అసలు ఎం జరగబోతుందనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

ఇక 29 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకునేందుకు బీజేపీ నాయకత్వం పావులు కదపడంలో బిజీ అయిపోయింది. బీజేపీ రెబెల్స్ బీజేపీకే మద్దతివ్వనున్నారు. విదర్భ ప్రాంతం నుంచి గెలిచినా ఒక ఇద్దరు స్వతంత్రులు శివసేనకు మద్దతిస్తూ, వారి ఎమ్మెల్యేలు ఉంటున్న హోటల్ లోనే ఉంటున్నారు.  

ఈ నేపథ్యంలో బీజేపీ నయా ప్రణాలోకాలను రచిస్తోంది. ఎం చేసైనా అధికారాన్ని దక్కించుకోవాలన్న కృతనిశ్చయంతో అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ పావులు కదుపుతోంది. 

click me!