మహిళ కాళ్లు, చేతులు కట్టేసి.. దారుణ హత్య

Published : Mar 15, 2021, 09:21 AM IST
మహిళ కాళ్లు, చేతులు కట్టేసి.. దారుణ హత్య

సారాంశం

శుక్రవారం రాత్రి దుకాణం మూసి వేసి ఇంటికి వెళ్లి చూడగా... భార్య భాను చనిపోయి కనిపించింది. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి హత్య చేసి ఉండటాన్ని చూసి భాషా షాకయ్యాడు. 


ఓ మహిళను కాళ్లు, చేతులు కట్టేసి మరీ అతి దారుణంగా హత్య చేశారు. సదరు మహిళ సహకార సంఘం కార్యదర్శి కావడం గమనార్హం. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సేలం అమ్మపేట బాలాజీ నగర్ కు చెందిన బాషా భార్య ఉమై భాను(45) సహకార సంఘం కార్యదర్శి. భాషా సమీపంలో వస్త్ర దుకాణం నడుపుతున్నాడు. శుక్రవారం రాత్రి దుకాణం మూసి వేసి ఇంటికి వెళ్లి చూడగా... భార్య భాను చనిపోయి కనిపించింది. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి హత్య చేసి ఉండటాన్ని చూసి భాషా షాకయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

ఆ ఇంట్లో శీతల పానీయాలు తాగినట్టుగా మూడు గ్లాసులు ఉండడంతో ఎవరో తెలిసిన వారే ఈ పని చేసి ఉంటారన్న నిర్ధారణకు పోలీసులు వచ్చారు. దీంతో శనివారం ఉదయం ఆ పరిసరాల్లోని నిఘా నేత్రాల్లోని దృశ్యాల ఆధారంగా నిందితుల్ని పట్టుకునే పనిలో అమ్మాపేట పోలీసులు నిమగ్నమయ్యారు. 
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?