Maharashtra political crisis: బిగ్ బ్రేకింగ్ ! మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్.. జూలై 1న ప్రమాణస్వీకారం!

By Rajesh KFirst Published Jun 29, 2022, 11:17 PM IST
Highlights

Maharashtra political crisis: మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రిగా  ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయ‌డంతో ఆ రాష్ట్ర త‌రువాత‌ సీఎంగా భాజపా నేత దేవేంద్ర ఫడ్నవీస్ జూలై 1న ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాల స‌మాచారం.  
 

Maharashtra political crisis: మహారాష్ట్ర రాజకీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ గురువారం బలపరీక్షకు పిలుపునివ్వ‌డంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. కానీ ఉద్ద‌వ్ ఠాక్రేకు ఎదురుదెబ్బ త‌గిలింది. గవర్నర్ నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. మరోవైపు గౌహతి నుంచి సేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు గోవాకు బయల్దేరి వెళ్లారు. ఈ క్ర‌మంలో ఉద్ద‌వ్ ఠాక్రే సంచల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. మహారాష్ట్ర బలపరీక్షపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఉద్ధవ్ ఠాక్రే పదవీవిరమణ చేశారు. బుధవారం రాత్రి సోషల్ మీడియా ద్వారా ప్రజలను ఉద్దేశించి ఆయన ఈ వార్తలను వెల్లడించారు. శాసన మండలి (ఎమ్మెల్సీ) సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన‌ట్టు తెలిపారు. 

మరోవైపు, ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేయడంతో బీజేపీ శిబిరంలో నేతలు సంబరాలు ప్రారంభ‌మ‌య్యాయి. రెబ‌ల్ లీడ‌ర్ ఏక్‌నాథ్ షిండే వర్గంలో 50 మంది ఎమ్మెల్యేలను కలుపుకుని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో మహారాష్ట్ర త‌రువాత‌ సీఎంగా భాజపా నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టే ఉన్నారు. ఇదిలా ఉంటే..శివసేన రెబల్ లీడ‌ర్ ఏక్ నాథ్ షిండేకు డిప్యూటీ సీఎం ప‌దవి ద‌క్కే అవ‌కాశ‌ముంద‌ట‌. అలాగే.. ప‌లువురు రెబల్ నేతల‌కుమంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు స‌మాచారం. మ్యాజిక్ ఫిగ‌ర్ దాక‌డంతో.. మరికొద్ది రోజుల్లోనే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో..జూలై 1న ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ క్ర‌మంలో.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, గోవా, మహారాష్ట్ర, తమిళనాడు ఇన్‌చార్జి సీటీ రవి తెల్లవారుజామున 2 గంటలకు ముంబైకి రానున్నారు. ముంబైకి వెళ్లాలని పార్టీ హైకమాండ్ కోరిన‌ట్టు తెలుస్తోంది.

ప్రభుత్వ ఏర్పాటుపై షిండే వర్గం, బీజేపీ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఏక్నాథ్ షిండేకు డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో పాటు ఆయన సహచరులు గులాబ్రావ్ పాటిల్, శంభురాజ్ దేశాయ్, సంజయ్ శిర్సత్, దీపక్ కేసర్కర్, ఉదయ్ సామంత్‌లకు  మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది.


ఉద్ధవ్ ఠాక్రే.. మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రిగా 2019 నవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేశారు. ఆయ‌న దాదాపు 31 నెలలు సీఎంగా కొనసాగారు. ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా తర్వాత.. శివసేన నాయకుడు సంజయ్ రౌత్ స్పందించారు. సున్నితమైన, సంస్కారవంతమైన ముఖ్యమంత్రి పదవీ విరమణ చేయవలసి వచ్చిందని ట్వీట్ చేశారు. మోసం అంతం కాదని.. చరిత్ర చెబుతోంది. ఠాక్రే గెలిచారు, ప్రజలు కూడా గెలిచారు. ఇది శివసేనకు తిరుగులేని విజయానికి నాందని ట్వీట్ చేశారు.
  
ఉద్ద‌వ్ ఠాక్రే ప్ర‌భుత్వంపై జూన్ 21న రెబ‌ల్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు ప్ర‌క‌టించారు. ఏక్‌నాథ్ షిండే.. రెబ‌ల్ ఎమ్మెల్యేలతో కలిసి గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లారు. దీని తర్వాత..  ఎమ్మెల్యేలు గౌహతి వెళ్లారు. 55 మంది శివసేన ఎమ్మెల్యేలలో 39 మంది ఏక్‌నాథ్ షిండే వెంట ఉన్నారు. తనకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని షిండే ప్రకటించారు. మహారాష్ట్రలో బీజేపీ అతిపెద్ద పార్టీ.. దాని ఎమ్మెల్యేల బలం 106. మహారాష్ట్ర శాసనసభ బలం 288. ఒక ఎమ్మెల్యే మృతి చెందడంతో ప్రస్తుతం సభ బలం 287కి చేరింది. ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాలంటే..  మెజారిటీ సంఖ్య 144 దాటాలి. శివసేనకు 55, ఎన్సీపీకి 53, కాంగ్రెస్‌కు 44 ఎమ్మెల్యేలు ఉండ‌గా..స్వతంత్ర ఎమ్మెల్యేల సంఖ్య 13.
 

ప్రజాస్వామ్యానికి మచ్చ : సీపీఐ(ఎం) నేత సీతారాం 

భారత ప్రజాస్వామ్యానికి ఈ ఘ‌ట‌న మచ్చ‌లాంటింద‌ని సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరి అన్నారు
సీతారాం ఏచూరి ట్విటర్‌లో ఇలా వ్రాస్తూ, “భారత ప్రజాస్వామ్యంపై పెద్ద నల్ల మచ్చ ప‌డింది,  గోవా, కర్ణాటక, ఇప్పుడు మహారాష్ట్ర .. ప్రభుత్వ యంత్రాంగాన్ని, కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వాలను కైవసం చేసుకోవడానికి జాతీయ ఆస్తులను దోచుకోవడం ద్వారా భారీ ధన బలం పోగుపడింద‌ని ట్వీట్ చేశారు.

click me!