
మహారాష్ట్రలో రాజకీయ గందరగోళం కొనసాగుతోంది. రోజు రోజుకు ఈ రాష్ట్రంలో పరిణామాలు మారిపోతున్నాయి. తాజాగా గౌహతిలో ఏక్ నాథ్ షిండే క్యాంపులో చేరిన తిరుగుబాటు ఎమ్మెల్యే తానాజీ సావంత్ పూణే కార్యాలయాన్ని శివసేన కార్యకర్తలు శనివారం ధ్వంసం చేశారు. కార్యకర్తల బృందం సావంత్‌కు చెందిన భైరవనాథ్ షుగర్ వర్క్స్ కార్యాలయంలోకి ఉదయం చొరబడి దాడి చేసింది. ఈ విషయాన్ని ఈ దాడిలో పాల్గొన్న పార్టీ కార్పొరేటర్ విశాల్ ధనవాడే తెలిపారు.
Maharashtra crisis: వెనక్కి తగ్గని రెబల్స్.. 'శివసేన బాలాసాహెబ్' గ్రూప్ గా ప్రకటన
తానాజీ సావంత్ రాష్ట్రంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలలో ఒకరు. ప్రస్తుతం గౌహతిలోని ఒక హోటల్‌లో క్యాంప్ లో ఉన్నారు. అయితే తిరుగుబాటు ఎమ్మెల్యేలను దేశద్రోహులుగా పేర్కొంటూ వారి కార్యాలయాలపై దాడులు చేస్తామని శివసేనకు చెందిన పూణె సిటీ హెడ్ సంజయ్ మోరే హెచ్చరించారు. ‘‘మా పార్టీ కార్యకర్తలు తానాజీ సావంత్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. మా చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను ఇబ్బంది పెట్టిన దేశద్రోహులు, తిరుగుబాటు ఎమ్మెల్యేలందరూ ఈ తరహా చర్యను ఎదుర్కొంటారు. వారి కార్యాలయాలపై కూడా దాడులు జరుగుతాయి. ఎవరినీ విడిచిపెట్టం ’’ అని ఆయన వార్తా సంస్థ ANI తో తెలిపారు.
శివసేన కార్యకర్తల దాడి నేపథ్యంలో ముంబై పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. నగరంలోని అన్ని రాజకీయ కార్యాలయాల వద్ద భద్రతను పెంచాలని అన్ని పోలీసు స్టేషన్లను కోరారు. పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది ప్రతి రాజకీయ కార్యాలయాన్ని సందర్శించి వారి భద్రతను నిర్ధారించాలని ఆదేశించారు. సావంత్ కార్యాలయంపై దాడి జరిగిన నేపథ్యంలో పూణె పోలీసులు కూడా ఇదే హెచ్చరిక జారీ చేశారు. ‘‘ తానాజీ సావంత్ కార్యాలయంలో రాజకీయ సంక్షోభం, విధ్వంసం నేపథ్యంలో పూణే పోలీసులు హెచ్చరిక జారీ చేసారు. నగరంలోని శివసేన నాయకులకు సంబంధించిన కార్యాలయాల వద్ద భద్రత కల్పించాలని అన్ని పోలీసు స్టేషన్లను కోరుతున్నారు ’’ అని పూణే పోలీసు PRO తెలిపారు.
అవి భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు - ఎమర్జెన్సీపై విధింపుపై కాంగ్రెస్ పై మండిపడ్డ బీజేపీ
ఇదిలా ఉండగా తమ కుటుంబ సభ్యులకు ఎదైనా ప్రమాదం జరిగితే దానికి మహారాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని తిరుగుబాటు ఎమ్మెల్యేల ముఖ్యనేత, మంత్రి ఏక్ నాథ్ షిండే అన్నారు. ఈ దాడుల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశౄరు. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సెక్యూరిటీని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించిందని తెలిపారు. తమకు, తమ కుటుంబాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. మరోవైపు 38 మంది ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల భద్రతను దురుద్దేశపూర్వకంగా ఉపసంహరించుకున్నారని ఆరోపిస్తూ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్, డీజీపీల Rajnish Sethలతో పాటు, రాష్ట్రంలోని పోలీసు కమిషనర్లకు ఏక్‌నాథ్ షిండే లేఖ రాశారు.
“మేము ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేం. మా నివాసంతో పాటు మా కుటుంబ సభ్యులకు ప్రోటోకాల్ ప్రకారం అందించాల్సిన భద్రతను ప్రతీకార చర్యగా చట్టవిరుద్ధంగా ఉపసంహరించబడింది. ఎన్సీపీ, ఐఎన్‌సీ గూండాలతో కూడిన ఎంవీఏ ప్రభుత్వం డిమాండ్‌లను అంగీకరించడానికి మాపై ఒత్తిడి తేవడానికి, మా సంకల్పాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈ దుర్మార్గపు చర్య మరొక ప్రయత్నం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు’’ అని ఏక్‌నాథ్ షిండే లేఖలో పేర్కొన్నారు. అయితే ఏక్‌నాథ్ షిండ్ చేసిన వ్యాఖ్యలను శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ఖండించారు.