విమానంలో మూత్ర విసర్జన కేసు : సోదరి పెళ్లి కోసం భారత్ కు వస్తూ తోటి ప్రమాణికుడిపై యూరినేట్..

Published : Mar 06, 2023, 10:57 AM IST
విమానంలో మూత్ర విసర్జన కేసు : సోదరి పెళ్లి కోసం భారత్ కు వస్తూ తోటి ప్రమాణికుడిపై యూరినేట్..

సారాంశం

విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేసిన ఓ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా అతను భారత్ కు తన సోదరి వివాహానికి హాజరుకావడానికి వచ్చినట్లు తెలుస్తోంది.  

న్యూఢిల్లీ : విమానంలో మూత్ర విసర్జన ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు ఈ నెలలో జరగనున్న తన సోదరి వివాహానికి హాజరయ్యేందుకు భారత్‌కు వచ్చాడని పోలీసు వర్గాలు తెలిపాయి. అతడిని పోలీసు కస్టడీలో తీసుకున్న కొన్ని గంటల తర్వాత నిందితుడికి బెయిల్ లభించిందని తెలిపారు. అయితే, ఘటన వెలుగులోకి రావడంతో  అతనిపై కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

ఈ నేరం ‘బెయిలబుల్ సెక్షన్ల’ కిందకు వస్తుంది కాబట్టి అతనికి బెయిల్ లభించిందని పోలీసులు తెలిపారు. ఎయిర్‌పోర్ట్ డీసీపీ, ఐజీఐ, దేవేష్ కుమార్ మహ్లా మాట్లాడుతూ, "ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయబడింది. ఈ కేసులో మేం మా వంతు కృషి చేస్తాం. నిందితుడు ఆర్యన్ వోహ్రాను విడుదల చేశారు" అని తెలిపారు. ఈ కేసులో నిందితుడైన వోహ్రాను ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఘటన జరిగిన వెంటనే పోలీసులకు అప్పగించింది. అతని మీద ఫిర్యాదు కూడా ఇచ్చింది. 

శనివారం రాత్రి న్యూయార్క్‌ నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం గాలిలో ఉండగా వోహ్రా ఓ యూఎస్‌ ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేస్తూ పట్టుబడ్డాడు. గత రాత్రి తమకు సమాచారం అందిందని, అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు. పోలీసులు అతనిపై ఐపీసీ, పౌర విమానయాన చట్టం కింద కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో ఉన్న అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితుడు అమెరికాలో చదువుతున్నాడని పోలీసులు తెలిపారు.

దారుణం.. వీధికుక్కలు వెంటపడడంతో బండిమీదినుంచి జారిపడి 55 యేళ్ళ మహిళ మృతి..

న్యూయార్క్ నుండి న్యూ ఢిల్లీకి అమెరికన్ ఎయిర్‌లైన్స్ (AA-292) విమానంలో ఒక భారతీయ ప్రయాణీకుడు యూఎస్ సహ-ప్రయాణికుడి మీద విమానం గాలిలో ఉన్నప్పుడు మూత్ర విసర్జన చేసినట్లు అధికారులు తెలిపారు. 21 ఏళ్ల నిందితుడు అమెరికాలో విద్యార్థి. మార్చి 4న మద్యం మత్తులో అమెరికా పౌరుడిపై మూత్ర విసర్జన చేశాడు.

"అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 292 జాన్ ఎఫ్. కెన్నెడీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (JFK) నుండి ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (DEL)కి సర్వీసు ఉంది" అని అమెరికన్ ఎయిర్‌లైన్ ప్రకటన తెలిపింది. భవిష్యత్తులో ఈ  ప్రయాణీకుడిని విమానంలోకి అనుమతించబోమని విమానయాన సంస్థ తెలిపింది.

"విమానం రాగానే, ప్రయాణీకుడు బాగా మత్తులో ఉన్నాడని, విమానంలో సిబ్బంది సూచనలను పాటించడం లేదని పర్స్సర్ తెలిపాడు. అతను ఆపరేటింగ్ సిబ్బందితో పదేపదే వాదించాడు, కూర్చోవడానికి ఇష్టపడలేదు. సిబ్బందిని ఇబ్బంది పెట్టాడు. విమాన భద్రతకు ప్రమాదంగా మారాడు. తోటి ప్రయాణీకుల భద్రతకు భంగం కలిగించి, చివరకు 15జీలో కూర్చున్న పాక్స్‌పై మూత్ర విసర్జన చేశారు" అని అమెరికన్ ఎయిర్‌లైన్స్ తెలిపింది.

ల్యాండింగ్‌కు ముందు అమెరికన్ ఎయిర్‌లైన్స్ పైలట్ విమానంలో వికృత ప్రయాణీకుడి గురించి ఢిల్లీ ఏటీసీని సంప్రదించి భద్రత గురించి చెప్పాడు. అవసరమైన చర్య కోసం సీఐఎస్ఎఫ్ కి సమాచారం అందించారు. "విమానం ల్యాండింగ్ తర్వాత, సీఐఎస్ఎఫ్ సిబ్బంది అతన్ని విమానం నుండి బయటకు తీసుకువెళ్లారు. ఆ ప్రయాణీకుడు సిబ్బందితో, సీఐఎస్ఎఫ్ తో అనుచితంగా ప్రవర్తించారు” అని విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు. దీంతో ఎయిర్‌పోర్టు పోలీసులు సదరు ప్రయాణికుడిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.

దీనిమీద తమ కూడా ఫిర్యాదు అందిందని.. అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. భారత విమానయాన నియంత్రణ సంస్థ కూడా విమానయాన సంస్థ నుండి వివరణాత్మక నివేదికను కోరింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు