దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండేకి కరోనా సోకింది.
ముంబై:మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ధనంజయ్ ముండేకు కరోనా సోకింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రకటించారు.
కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో భయపడాల్సిన అవసరం లేదని అజిత్ పవార్ చెప్పారు. తమ కేబినెట్ సహచరుడు ధనంజయ్ ముండేకి కరోనా సోకిందని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సోమవారంనాడు మీడియాకు చెప్పారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్టుగా అజిత్ పవార్ చెప్పారు.
undefined
మంత్రి ధనుంజయ్ ముండే కార్యాలయం కూడ ఈ విషయాన్ని ధృవీకరించింది.అయితే మంత్రి ధనంజయ్ ముండేకు సోకిన వైరస్ ఏమిటనే విషయం మాత్రం ఇంకా ధృవీకరించలేదు.
ఈ నెల 20వ తేదీన నాగ్‌పూర్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాల చివరి రోజున కరోనా సోకిందని ధనుంజయ్ ముండే కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఈ నెల 21 ధనుంజయ్ ముండే ఇంటికి వెళ్లి ఐసోలేషన్ లో ఉన్నారని మంత్రి కార్యాలయ సిబ్బంది వివరించారు. వైద్యుల సూచనల మేరకు మంత్రి ముండే మందులు వాడుతున్నారన్నారు. తన శాఖకు సంబంధించిన కార్యకలాపాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు పలు సూచనలు, సలహాలను మంత్రి అందిస్తున్నారని సిబ్బంది వివరించారు.
మంత్రి కార్యాలయ సిబ్బంది కొందరు కూడ అనారోగ్యం పాలయ్యారని కూడ ఆయన వివరించారు. అనారోగ్యం పాలైన సిబ్బంది కూడ ఐసోలేషన్ లో ఉన్నారని మంత్రి కార్యాలయం ప్రకటించింది.
దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో ఈ నెలలోనే కేరళ రాష్ట్రంలో కరోనా జేఎన్.1 వేరియంట్ కేసు వెలుగు చూసింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ కేసులు పెరుగుతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదయ్యాయి.