రాత్రి 7 గంటల సమయంలో ముంబై నుంచి ఇండోర్ వెళ్తున్న ట్రైలర్ ట్రక్ రోడ్డు డివైడర్‌ను ఢీ కొట్టి రాంగ్ లేన్‌లోకి ప్రవేశించడంతో ఈ దారుణం జరిగింది.
మధ్యప్రదేశ్: వేగంగా దూసుకొచ్చిన ట్రైలర్ ట్రక్కు ఎదురుగా వెళ్తున్న కారును, ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఐదుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మైనర్ బాలికతో సహా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ధార్ జిల్లాలోని ధామ్‌నోద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుజారి గ్రామ సమీపంలో ఆగ్రా-బాంబే జాతీయ రహదారి నంబర్ 3 (రౌ - ఖల్‌ఘాట్ సెక్షన్ల మధ్య)పై గణపతి ఘాట్ వద్ద ప్రమాదం జరిగింది.
ముంబై నుంచి ఇండోర్ వెళ్తున్న ట్రైలర్ ట్రక్ మొదట రోడ్డు డివైడర్‌ను ఢీ కొట్టి రాంగ్ లేన్‌లోకి ప్రవేశించింది. కారును, మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టింది. దీనికి ముందు మరో రెండు ట్రక్కులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక మోటార్‌సైకిలిస్ట్, ఇద్దరు ట్రక్కు డ్రైవర్లతో సహా ఓ కారులోని వారు మొత్తంగా ఐదుగురు సజీవ దహనమయ్యారని, ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటన సోమవారం రాత్రి 7 గంటల సమయంలో జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. క్షతగాత్రులను ఇండోర్, మోవ్, ధమ్నోద్‌లకు రిఫర్ చేసినట్లు ధమ్నోడ్ సబ్-డివిజనల్ ఆఫీసర్ (పోలీస్) మోనికా సింగ్ తెలిపారు. ఇప్పటివరకు, ఒక బాధితుల్లో ఒకరైన మోటారుసైకిల్‌పై ఉన్న వ్యక్తికి మన్పూర్ గ్రామానికి చెందిన జితేంద్ర జాత్ గా నిర్ధారించారు. ఇద్దరు ట్రక్ డ్రైవర్ల గుర్తింపు ఇంకా వెల్లడి కాలేదు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో ఎస్ డీఓపీ సింగ్‌కు సమాచారం అందించారు.
గాయపడిన వారిలో ఇండోర్‌కు రెఫర్ చేసిన నరేష్ జాదవ్ (40), సాగూర్ గ్రామానికి చెందిన విష్ణు గైక్వాడ్ కుమార్తె అనిక (8)లను మోవ్‌ను రిఫర్ చేశారు. జమ్మూ నివాసి షెజ్జాద్ తన్వీర్ (30)ని ధమ్నోద్ ఆసుపత్రికి తరలించారు.
లారీ డ్రైవర్ అదుపు తప్పి రోడ్డు డివైడర్‌ను ఢీ కొట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. రెస్క్యూ టీమ్, ఫైర్ టెండర్లు రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. కారులో తీవ్ర మంటలు చెలరేగడానికి ముందే రెస్క్యూ టీం వెంటనే లోపల చిక్కుకున్న వారందరినీ బయటకు తీసుకొచ్చింది.