
ఔరంగాబాద్ : Maharashtraలో ఓ బ్యానర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు second wife కావాలంటూ నగరం మొత్తం బ్యానర్లు ఏర్పాటు చేశాడో వ్యక్తి. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. కొద్ది రోజుల్లో Aurangabad మున్సిపల్ ఎన్నికలు రానున్నాయి. రమేశ్ పాటిల్ అనే వ్యక్తి పోటీ చేయాలనుకున్నాడు.
కానీ, అతనికి ముగ్గురు పిల్లలు ఉండటం వల్ల ఎన్నికల్లో పోటీచేసే అర్హత కోల్పోయాడు. ఎలాగైనా బరిలో నిలవాల్సిందేనని పట్టుదలతో ఉన్న రమేష్.. ఓ ఉపాయం ఆలోచించాడు. తాను నిలబడలేకపోయినా.. తన కుటుంబంలో నుంచి ఒకరిని పోటీలో నిలపాలనుకున్నాడు.
అయితే, సోదరుడు, సోదరి, తల్లిదండ్రులను కాదండోయ్.. రెండో పెళ్లి చేసుకుని వచ్చే భార్యను ఎన్నికల్లో పోటీ చేయించాలని సంకల్పించుకున్నాడు. ఈ నేపత్యంలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు రెండో భార్య కావాలంటూ ఏకంగా ఔరంగాబాద్ మొత్తం బ్యానర్లు కట్టించాడు.
తనకు కాబోయే భార్య ఎలా ఉండాలో అందులో పేర్కొన్నాడు. పెళ్లి అయి ఉంటే ఆ మహిళకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలనే షరతు కూడా విధించాడు. తన ఫోన్ నంబర్ సైతం బ్యానర్లలో అచ్చు వేయించాడు. ఇప్పుడు ఆయన ప్రకటనపైనే నగర జనం మొత్తం చర్చించుకుంటున్నారు.
ఇదిలా ఉండగా, Uttar Pradeshలో PPE kitలో వచ్చి Nomination వేసిన ఓ అభ్యర్థి ధరఖాస్తు చివరకు Rejectionకు గురైంది. దరఖాస్తులను పరిశీలించిన అధికారులు... సరైన పత్రాలు సమర్పించకపోవడంతో తిరస్కరించినట్లు వెల్లడించారు. విషయం తెలుసుకున్న సదరు అభ్యర్థి అక్కడి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి బోరున విలపించాడు. అంతే కాకుండా ఓ కేంద్ర మంత్రితో అధికారులు కుమ్మక్కై తన నామినేషన్ తిరస్కరించారంటూ ఆరోపించాడు. ఉత్తరప్రదేశ్లోని Samyukta Vikas Partyకి చెందిన వైద్య రాజ్ కిషన్ కు తాజాగా ఈ సంఘటన ఎదురైంది.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకుగానూ Vaidya Raj Kishan అనే వ్యక్తి జనవరి 25వ తేదీన రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లాడు. ఆ సమయంలో తన వెంట శానిటైజర్, థర్మల్ స్కానర్ లను కూడా తెచ్చుకున్నాడు. నామినేషన్ ను పరిశీలించిన అధికారులు మరిన్ని పత్రాలు అవసరమని అతడికి సూచించారు. అయితే, అలా వచ్చిన తనను అధికారులు. నామినేషన్ వేయకుండా అడ్డుకున్నట్లు అదేరోజు కిషన్ ఆరోపించాడు. చివరకు అధికారులు కోరిన పత్రాలు తెచ్చి ఇవ్వడంతో నామినేషన్ ప్రక్రియ పూర్తిచేశాడు. వాటిని పరిశీలించిన ఎన్నికల అధికారులు కిషన్ నామినేషన్ను తిరస్కరించినట్లు ఆదివారం వెల్లడించారు.
దీంతో కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ఆ వ్యక్తి బోరున విలపించాడు. ఓ కేంద్రమంత్రి సూచనలతోనే అధికారులు తన నామినేషన్ ను తిరస్కరించారని ఆరోపించాడు. అయితే అఫిడవిట్ తో పాటు సరైన పత్రాలు సమర్పించనందువల్లే అతడి నామినేషన్ తిరస్కరణకు గురైందని జిల్లా ఎన్నికల అధికారి దేవేంద్ర ప్రతాప్ సింగ్ స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి సురేష్ ఖన్నా.. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని కొట్టేశారు.
ఇదిలా ఉంటే నామినేషన్ వేసిన సంయుక్త వికాస్ పార్టీకి చెందిన వైద్య రాజ్ కిషన్.. ఇప్పటివరకు 18 ఎన్నికల్లో పోటీ చేశారు. అన్ని ఎన్నికల్లోనూ ఆయన డిపాజిట్ కూడా కోల్పోయారు. ఇక ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బరిలో దిగనున్న గోరక్పూర్ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు కిషన్ ఇటీవలే పేర్కొనడం గమనార్హం.