కేక్ కట్ చేసిన నేరానికి జైలుకెళ్లాడు

Siva Kodati |  
Published : Oct 23, 2020, 08:57 PM IST
కేక్ కట్ చేసిన నేరానికి జైలుకెళ్లాడు

సారాంశం

ఒళ్లు తెలియని తనమో, అహంకారమో కానీ కొందరు అతిగా ప్రవర్తించి లేనిపోని చిక్కుల్లో పడుతుంటారు. ఓ వ్యక్తి బర్త్‌డే రోజున కేక్ కట్ చేసి కటకటాల పాలయ్యాడు.

ఒళ్లు తెలియని తనమో, అహంకారమో కానీ కొందరు అతిగా ప్రవర్తించి లేనిపోని చిక్కుల్లో పడుతుంటారు. ఓ వ్యక్తి బర్త్‌డే రోజున కేక్ కట్ చేసి కటకటాల పాలయ్యాడు. పుట్టినరోజు నాడు కేక్ కట్ చేస్తే జైలుకు వెళ్లడం ఏంటనేగా మీ డౌట్.

అసలు వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన 19 ఏళ్ల నిఖిల్‌ పటేల్‌ అక్టోబర్‌ 21న తన పుట్టినరోజు పురస్కరించుకొని అందరిని పిలిచి ఘనంగా వేడుకలు నిర్వహించాడు.

పార్టీ మధ్యలో వచ్చిన నిఖిల్‌ స్నేహితులు నాలుగు పెద్ద కేక్‌లను అరేంజ్‌ చేశారు. సాధారణంగా అయితే ఆ కేకులను కత్తితో కట్‌చేస్తే సరిపోయేది.. కానీ నిఖిల్‌ ఇక్కడే కాస్త అతిగా ప్రవర్తించాడు.

ఘనంగా పుట్టినరోజు జరుపుకుంటున్న తాను కేక్‌ను కత్తితో కట్‌చేస్తే మజా ఎలా ఉంటుందని చెప్పి లోపలికి వెళ్లి ఖడ్గం తెచ్చి కేక్‌ను కట్‌ చేశాడు. నిఖిల్‌ చేసిన పనిని అతని స్నేహితులు ఫోటోలు తీసి వాట్సప్‌లో షేర్‌ చేశారు.

అయితే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఫోటోలు పోలీసుల దృష్టిలో పడ్డాయి. వెంటనే నిఖిల్‌ ఇంటికి చేరుకున్న పోలీసులు అతన్ని మారణాయుధాల చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. 

PREV
click me!

Recommended Stories

PM Modi: మోదీ నా బిడ్డకు పునర్జన్మనిచ్చారు.. ప్రధానిని దూషించిన బాలిక తల్లి ఎమోషన్
భోగాపురం పర్యటనలో మోదీ సెక్యూరిటీ చూశారా | PM Modi High-Level Security at Bhogapuram Airport