లెదర్ బాల్‌గా మారిన లంగ్స్: కరోనాతో మరణించిన రోగి డెడ్ బాడీ పరీక్షలో ఆసక్తికరం

By narsimha lodeFirst Published Oct 23, 2020, 5:24 PM IST
Highlights

కరోనా సోకిన రోగి ఊపిరితిత్తులు లెదర్ బాల్ కంటే స్ట్రాంగ్ గా మారాయని శవ పరీక్షలో తేలింది.


బెంగుళూరు: కరోనా సోకిన రోగి ఊపిరితిత్తులు లెదర్ బాల్ కంటే స్ట్రాంగ్ గా మారాయని శవ పరీక్షలో తేలింది.కరోనా వైరస్ సోకిన రోగుల మరణాలకు సంబంధించి శవ పరీక్షల్లో కీలక విషయాలు తెలిసినట్టుగా వైద్యులు ప్రకటించారు.

కర్ణాటకకు చెందిన 62  ఏళ్ల వ్యక్తి కరోనాతో మరణించారు. డెడ్ బాడీకి నిర్వహించిన పరీక్షలో వైద్యులు కీలక విషయాలను  తెలుసుకొన్నారు.
18 గంటల తర్వాత మృతుడి ఊపిరి తిత్తులు తోలు బంతిగా మారినట్టుగా గుర్తించారు. రక్తనాళాలలో గడ్డలు ఏర్పడ్డాయని వైద్యులు చెప్పారు.

ఈ నెల 10వ తేదీన  డెడ్ బాడీ పోస్టుమార్టం నిర్వహించారు. మరణించిన తర్వాత కూడ రోగి శరీరంలోని వైరస్ కరోనా వ్యాప్తికి దోహదపడుతోందని నివేదికలు చెబుతున్నాయి.

మృతి చెందిన రోగి శరీరంలోని ముక్కు, గొంతు, నోరు, ఊపిరితిత్తులు, ఉపరితం, శ్వాసకోశమార్గాలు, ముఖం, మెడ, చర్మం పై శాంపిల్స్ తీసుకొన్నారు.చర్మంపై నుండి సేకరించిన శాంపిల్స్ లో నెగిటివ్ వచ్చింది.  మరణించిన వ్యక్తి శరీరం నుండి కరోనా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని ఆక్స్ ఫర్డ్ మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ దినేష్ రావు చెప్పారు. 

click me!