బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: ఐదుగురు మృతి

Published : Oct 23, 2020, 04:41 PM ISTUpdated : Oct 23, 2020, 04:49 PM IST
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: ఐదుగురు మృతి

సారాంశం

తమిళనాడు రాష్ట్రంలోని విరుదునగర్‌లో శుక్రవారం నాడు టపాసుల కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు.  

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని విరుదునగర్‌లో శుక్రవారం నాడు టపాసుల కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు.

ఈ ఘటనలో తమిళనాడు విరుదునగర్ లోని బాణసంచా తయారు చేసే ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ పేలుడులో ముగ్గురు మహిళలు సహా ఐదుగురు మరణించినట్టుగా సమాచారం.

ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఐదుగురు మరణించినట్టుగా స్థానికులు చెప్పారు. బాణసంచా పేలుడు కారణంగా భారీగా మంటలు వ్యాపించాయి. మంటలను ఆర్పేందుకు ఫైరింజన్లు ప్రయత్నిస్తున్నాయి.

ఈ ఘటనలో మరో పది మందికి గాయాలయ్యాయి.   గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు.

గతంలో కూడ తమిళనాడు రాష్ట్రంలోని టపాకాయల తయారీ కేంద్రంలో పేలుళ్లు సంభవించాయి.

సరైన జాగ్రత్తలు తీసుకోని కారణంగానే టపాసుల తయారీ కేంద్రాల్లో పేలుళ్లు సంభవిస్తున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలోనే అధికారులు హడావుడి చేస్తారు. ఇతర సమయాల్లో వదిలేయడంతో తరచుగా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.
 


 

PREV
click me!

Recommended Stories

Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !
కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు