భారతదేశంలో కరోనా కేసులు లక్షకు చేరువవుతున్నాయి. దేశంలోనే అత్యధికంగా సతమతమవుతున్న రాష్ట్రం మహారాష్ట్ర. ఇప్పటికే అక్కడ కోవిడ్ 19 బారిన పడిన వారి సంఖ్య 30 వేలు దాటింది.
భారతదేశంలో కరోనా కేసులు లక్షకు చేరువవుతున్నాయి. దేశంలోనే అత్యధికంగా సతమతమవుతున్న రాష్ట్రం మహారాష్ట్ర. ఇప్పటికే అక్కడ కోవిడ్ 19 బారిన పడిన వారి సంఖ్య 30 వేలు దాటింది.
శనివారం కొత్తగా మరో 1,606 కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య వెల్లడించింది. కాగా రాష్ట్రంలోని కరోనా తీవ్రత దృష్ట్యా లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
Also Read:బేకరి యజమానికి కరోనా: షాపుకు వచ్చిన 500 మంది శాంపిల్స్ సేకరణ
అటు దేశ వాణిజ్య రాజధాని ముంబైలోనూ కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. శనివారం ఒక్కరోజే 884 కేసులు నమోదయ్యాయి. కరోనా నియంత్రణ కోసం బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ కొత్త కంటైన్మెంట్ పాలసీ విధానాన్ని తీసుకొస్తోంది.
ఇప్పటి వరకు ఎక్కడైనా కరోనా కేసులు బయటపడితే ఆ ఇంటి సమీప ప్రాంతాన్ని కంటోన్మెంట్ జోన్‌గా ప్రకటించేవారు. అలాగే బాధితుల ఇంటి మీదుగా వెళ్లే రహదారులను ఇనుప కంచెలు, స్తంభాలతో మూసివేసేవారు.
Also Read:విజృంభణ: దేశవ్యాప్తంగా 90 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
కొత్తగా ప్రవేశపెట్టనున్న విధానంతో కోవిడ్ 19 బారినపడి వారు నివసిస్తున్న ఇల్లు, లేదా అపార్ట్‌మెంట్‌ను మాత్రమే కంటోన్మెంట్ జోన్‌గా ప్రకటిస్తారు. దీని కారణంగా ఒక గేటెడ్ కమ్యూనిటీలోని ఇతర అపార్ట్‌మెంట్ వాసులకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది.
కేవలం వైరస్ బారినపడిన వారు నివసిస్తున్న అపార్ట్‌మెంట్ మినహా మిగిలిన లాక్‌డౌన్ నిబంధనల మేరకు పనులు చేసుకునే అవకాశం కలుగుతుంది. దీని వల్ల ప్రభుత్వాధికారులు, పోలీసులపైనా భారత తగ్గుతుందని ముంబై మున్సిపల్ కార్పోరేషన్ భావిస్తోంది.