కేసీఆర్ డిమాండ్ కి తలొగ్గిన కేంద్రం: నిర్మలమ్మ ప్రకటన

By Sree sFirst Published May 17, 2020, 1:11 PM IST
Highlights

ఈ కరోనా వైరస్ మహమ్మారి మొదలైనప్పటి నుండి అన్ని రాష్ట్రాలు కూడా కేంద్రాన్ని కరోనా పై పోరాడడానికి డబ్బులు ఇవ్వవలిసిందిగా కోరుతున్నారు. లాక్ డౌన్ వల్ల ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోవడంతో తిర్హమా చేతుల్లో డబ్బులేదని వారు అడుగుతూనే ఉన్నారు. 

ఈ కరోనా వైరస్ మహమ్మారి మొదలైనప్పటి నుండి అన్ని రాష్ట్రాలు కూడా కేంద్రాన్ని కరోనా పై పోరాడడానికి డబ్బులు ఇవ్వవలిసిందిగా కోరుతున్నారు. లాక్ డౌన్ వల్ల ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోవడంతో తిర్హమా చేతుల్లో డబ్బులేదని వారు అడుగుతూనే ఉన్నారు. 

మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక అడుగు ముందుకేసి కేంద్రం దగ్గర డబ్బులేకపోతే... మమ్మల్నయినా అప్పు తీసుకొనియ్యండని అభ్యర్థన చేస్తున్నారు. ఎఫ్ ఆర్ బి ఎం లిమిట్ ను పెంచమని కోరుతున్నారు. 

 ఎఫ్ ఆర్ బి ఎం  అంటే... ఫిస్కల్ రెస్పాన్స్  బుడ్జెటరీ మానేజ్మెంట్. రాష్ట్రాల స్థూల ఉత్పత్తిపై అప్పు తీసుకునే సామర్థ్యం. ఇప్పటి వరకు రాష్ట్రాలు వాటివాటి స్థూల ఉత్పత్తి ఎంత ఉందూ దానిలో 3 శాతాన్ని అప్పుగా తీసుకునే ఆస్కారం ఉంది. 

ఇప్పుడు అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిగణలోకి తీసుకున్న మీదట దాన్ని 5 శాతానికి పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఒక 0.5 శాతం డైరెక్ట్ గా తీసుకోగలిగితే... మిగిలిన 1.5 శాతాన్ని తీసుకోవడానికి మెలిక పెట్టింది కేంద్రం. 

ఒక శాతాన్ని నాలుగు విడతలుగా ఇవ్వనుంది ప్రభుత్వం. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు, ఈజ్  అఫ్ డూయింగ్  బిజినెస్, విద్యుత్ సంస్కరణలు, పట్టణ పురపాలక సంస్కరణలకు సంబంధించిన ఒక్కో స్టెప్ తీసుకుంటూ పోతే... 0.25 శాతం అప్పుగా తీసుకునే వీలుంటుంది. 

ఈ నాలుగు సంస్కరణల్లో ఒక్కో సంస్కరణ పూర్తి చేస్తే 0.25 శాతం అప్పు తీసుకునే వీలుంటుంది. ఏవైనా మూడు సంస్కరణలను గనుక రాష్ట్రాలను పూర్తి చేస్తే.... అప్పుడు మిగిలిన 0.5 శాతం కూడా తీసుకునే వీలుంటుంది. అంటే... నాలుగు విడతలుగా ఆ మిగిలిన ఒక్కశాతాన్ని, మూడు సంస్కరణలు పూర్తిచేసిన తరువాత మిగిలిన 0.5 శాతం అన్నమాట. 

మొత్తానికి మెలికలో, ఏవో ఒకటి కేంద్రం ఇన్నాళ్లకు మన ముఖ్యమంత్రి కేసీఆర్ మాటను మాత్రం విన్నదన్నమాట. కేసీఆర్ దానితోపాటుగా క్వాంటిటేటివ్ ఈజింగ్, హెలికాప్టర్ మనీ గురించి కూడా ప్రస్తావించారు. త్వరలోనే కేంద్రం ఆ దిశగా కూడా చర్యలు చేపట్టాల్సి వచ్చేలానే కనబడుతుంది. 

click me!