మరో వారం లాక్‌డౌన్ పొడిగింపు: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

By narsimha lode  |  First Published Apr 25, 2021, 12:19 PM IST

దేశ రాజధాని ఢిల్లీలో మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్ ను పొడిగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.


న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్ ను పొడిగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఆదివారం నాడు  ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది మే 3వ తేదీవరకు లాక్ డౌన్ కొనసాగనుంది. వాస్తవానికి  ఈ నెల 26వ తేదీ ఉదయం 5 గంటల వరకు  లాక్ డౌన్ పూర్తి కానుంది. అయితే ఢిల్లీలో కేసుల ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో  లాక్ డౌన్ ను మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ ఆ రాష్ట్రం నిర్ణయం తీసుకొంది.

ఢిల్లీలో కొన్ని కఠిన చర్యలు తీసకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వారం రోజుల పాటు  లాక్ డౌన్ ను పొడిగించాల్సి వచ్చిందని ఆయన వివరించారు.ఢిల్లీలో కరోనా ప్రభావం తగ్గలేదని ఆయన చెప్పారు. ఢిల్లీకి రోజులకు 700 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉందని ఆయన చెప్పారు. ఆక్సిజన్ మిగులు ఉన్న రాష్ట్రాలు తమకు సహాయం చేయాలని ఆయన పలు రాష్ట్రాల సీఎంలను కోరారు. 

Latest Videos

ఢిల్లీలో శనివారం నాడు కరోనాతో 357 మంది మరణించారు. ఆక్సిజన్ అందక చనిపోయే రోగుల సంఖ్య ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఢిల్లీలో కరోనా కేసులు 10 లక్షలు దాటాయి. అంతేకాదు 13,898 మంది మరణించారు. 32.27 శాతం కరోనా పాజిటివ్ రేటుగా ఉందని అధికారులు తెలిపారు. 


 

click me!