లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌తో త‌ల‌పై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న బీజేపీ సీనియర్ నేత‌

Published : Oct 11, 2022, 04:19 PM IST
లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌తో త‌ల‌పై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న బీజేపీ సీనియర్ నేత‌

సారాంశం

మహారాష్ట్రలోని బీడ్ జిల్లా విషాదం నెల‌కొంది. బీడ్‌లో బీజేపీ నగర అధ్యక్షుడు భగీరథ బియానీ.. మీరా నగర్ ప్రాంతంలోని తన ఇంట్లో లైసెన్స్ రివాల్వర్‌తో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌తో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది.

మహారాష్ట్రలో కీలక రాజకీయ ఘట్టాలు చోటుచేసుకుంటున్న వేళ బీడులో ఓ సంచలన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బీడ్‌లో బీజేపీ నగర అధ్యక్షుడు భగీరథ బియానీ త‌న లైసెన్స్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా కలకలం రేపింది. 

అందిన సమాచారం ప్రకారం.. మహారాష్ట్ర బీజేపీ బీడ్ జిల్లా యూనిట్ చీఫ్ భగీరథ బియానీ..  మీరా నగర్ ప్రాంతంలోని  మంగళవారం తన ఇంట్లో లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో  తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తుపాకీ కాల్పుల శబ్దం విన్న బియానీ కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని.. వెంటనే అతన్ని నగరంలోని ఫీనిక్స్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే, అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

పోలీసులు పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనే కోణంలో పోలీసులు విచారణలో నిమగ్నమయ్యారు. ఆయ‌న గ‌త కొన్నిరోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, తదుపరి విచారణ జరుగుతోందని పోలీసు అధికారి తెలిపారు.  అయితే భగీరథ్ బియానీ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయంపై ఇంకా గందరగోళం నెలకొంది. కాగా, ఈ ఘటనతో బీజేపీలోనూ దుమారం రేగడంతో ఎంపీ ప్రీతమ్ ముండే ఘటనాస్థలికి చేరుకున్నట్లు సమాచారం.

ట్రాన్స్‌జెండర్ పై అత్యాచారం.. ఫిర్యాదు వెనక్కి తీసుకోమ‌ని బ‌ల‌వంతంగా  ఫినైల్ తాగించిన నిందితులు 

మహారాష్ట్రలోని ముంబైలో ట్రాన్స్‌జెండర్‌పై అత్యాచారం చేసిన అనంతరం ముగ్గురు నిందితులు పదునైన ఆయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం బాంద్రాలోని భాభా ఆసుపత్రిలో చేర్పించారు. ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని నిందితులు తమపై ఒత్తిడి తెచ్చారని ట్రాన్స్‌జెండర్ ఆరోపించింది.

ఫిర్యాదును ఉపసంహరించుకోనందుకు ట్రాన్స్‌జెండర్‌ను బలవంతంగా ఫినైల్ తాగించారు. ఫిర్యాదు మేరకు శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్‌లో ముగ్గురు నిందితులపై 307, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా, ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్