
ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)తో సంబంధాలున్న ఆరోపణలపై కశ్మీర్‌కు చెందిన ఓ వ్యక్తిని మహారాష్ట్ర పోలీసుల యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) గురువారం అరెస్టు చేశారు. అరెస్టు అయిన నిందితుడిని జునైద్ మహ్మద్‌తో గా గుర్తించామని పోలీసులు తెలిపారు. గత కొన్ని రోజులుగా నిందితుడి కోసం పూణే ఏటీఎస్ కు చెందిన మూడు బృందాలు స్థానిక జిల్లా పోలీసుల సమన్వయంతో కార్గిల్, గందేర్బల్, శ్రీనగర్ ప్రాంతాల్లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాయి. ఎట్టకేలకు అతడిని అదుపులోకి తీసుకున్నాయి.
‘‘ హిందువులు తమకు వ్యతిరేకం అని ముస్లింలు అనుకోవద్దు ’’- ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
కాగా బుధవారం సాయంత్రం మహారాష్ట్ర ఏటీఎస్ బృందం జమ్మూకశ్మీర్ లోని కిష్త్వార్ జిల్లాకు చెందిన 28 ఏళ్ల అఫ్తాబ్ హుస్సేన్ షాను కూడా అరెస్టు చేసింది. జునైద్ మహమ్మద్ కు, విదేశాల్లో ఉన్న ఎల్ఇటీ కార్యకర్తకు మధ్య సంబంధాలున్నట్లు షాపై ఆరోపణలు ఉన్నాయి. షాను ఆ అధికార పరిధిలోని సమర్థ న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. దీంతో అతడిని మూడు రోజుల ట్రాన్సిట్ రిమాండ్‌పై మహారాష్ట్రలోని ATS కి అప్పగించారు. మహారాష్ట్రకు వచ్చిన తర్వాత అతన్ని పోలీసు కస్టడీ కోసం సంబంధిత న్యాయస్థానం ముందు హాజరుపరచాల్సి ఉంటుంది.
కాశ్మీర్ లో మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఇద్దరు వలస కార్మికులపై కాల్పులు.. ఒకరు మృతి..
నిందితుడు అఫ్తాబ్ హుస్సేన్ షా కిష్త్వార్‌లో పుట్టి పెరిగాడు. అతను వృత్తిరీత్యా కార్పెంటర్. అతడికి కిష్త్వార్‌లో భూమి కూడా ఉంది. కాగా మహారాష్ట్ర ఏటీఎస్ ప్రకారం 28 ఏళ్ల మహ్మద్ జునైద్ పూణేలో నివసిస్తున్న భారతీయ పౌరుడు. అతడికి లష్కరే తోయిబా ఉగ్రవాద నెట్ వర్క్ తో సంబంధాలు ఉన్నాయి. అయితే లష్కరే తోయిబాతో జునైద్ కు ఉన్న సంబంధాల విషయం ఏటీఎస్ బృందానికి కొంత సమాచారం అందింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని కూడా ఏటీఎస్ రికార్డు చేసింద.
లష్కరే తోయిబా కశ్మీర్ క్రియాశీలక సభ్యులతో జునైద్ టచ్ లో ఉండేవాడని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎల్ఇటీ కోసం యువతను రిక్రూట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఏటీఎస్ అధికారి ఒకరు తెలిపారు. రిక్రూట్ మెంట్లు పూర్తయిన తరువాత యువకులను శిక్షణ కోసం, ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు జమ్మూకశ్మీర్ కు తీసుకెళ్తారని పేర్కొన్నారు. జునైద్, లష్కరే తోయిబా మధ్య జరిగిన లావాదేవీల విషయాన్ని అధికారులు తెలియజేశారు.
తెలంగాణకు ప్రధాని రూ. 2,52,202 కోట్లు ఇచ్చారు.. సవతి తల్లి ప్రేమ చూపలేదు - అమిత్ షా
‘‘ జునైద్ జాతీయ భద్రత, మత సామరస్యానికి భంగం కలిగించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఫేస్బుక్, వాట్సాప్ వంటి వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా పలు కామెంట్స్ ను పోస్ట్ చేస్తూ కమ్యూనిటీల మధ్య మతపరమైన చీలికను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాడు అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది ’’ అని ఏటీఎస్ తెలిపింది. జునైద్ పై సెక్షన్ 153ఎ (మతం, జాతి మొదలైన వాటిపై దాడులు), 121ఎ (రాష్ట్రానికి వ్యతిరేకంగా కొన్ని నేరాలకు కుట్ర చేయడం), 116 (ప్రభుత్వోద్యోగికి లంచం ఇవ్వడం)తో పాటు భారతీయ శిక్షాస్మృతిలోని ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.