ప్రయాగరాజ్ మహా కుంభమేళా 2025 యాత్రికుల కోసం ఇటు యోగి, అటు మోదీ ప్రభుత్వాలు సకల ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే రైలుమార్గంలో ప్రయాగరాజ్ చేరుకోవాలనుకునే వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసారు.
ప్రయాగరాజ్ మహా కుంభమేళా 2025 కోసం ముమ్మర ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ కుంభమేళాకు దాదాపు 40-50 కోట్లమంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఇలా భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రైలు ప్రయాణికుల కోసం టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. ప్రయాగరాజ్ డివిజన్ రైల్వే లక్షలాది మంది యాత్రికులకు సున్నితమైన, సులభమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఈ హెల్ప్‌లైన్‌ను ప్రవేశపెట్టింది.
ప్రయాగరాజ్ మహా కుంభమేళా అనాదిగా జరుగుతూ వస్తోంది... కానీ ప్రత్యేకంగా ఇటువంటి సేవ అందుబాటులో ఉండటం ఇదే మొదటిసారి. నవంబర్ 1న ప్రారంభం కానున్న ఈ హెల్ప్‌లైన్ ద్వారా భక్తులు రైళ్ల టైమింగ్స్ తో పాటు రైల్వేకు సంబంధించిన ఇతర సేవల గురించి సులభంగా సమాచారాన్ని యాక్సెస్ చేయడంలో సహాయపడుతుంది.
దీనికి తోడు ప్రయాగరాజ్ రైల్వే డివిజన్ మహా కుంభమేళా కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా యాక్సెసిబిలిటీని మెరుగుపరుస్తోంది. రైల్వే వెబ్‌సైట్‌తో పాటు, ఈ యాప్ వన్-స్టాప్ వనరుగా పనిచేస్తుంది, భక్తులకు సమాచారం, సహాయాన్ని అందించడం ద్వారా వారి యాత్రను సాధ్యమైనంత సున్నితంగా చేస్తుంది.
ప్రయాగరాజ్ లో జరగనున్న మహా కుంభమేళా గొప్ప, ఆధ్యాత్మిక అనుభవంగా ఉండేలా ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా ప్రయాగరాజ్ రైల్వే డివిజన్‌లో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి, ఇక్కడ దాదాపు 992 రైళ్లు తొమ్మిది స్టేషన్ల నుండి నడుస్తాయి.
రైల్వే డివిజన్ PRO అమిత్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం... యాత్రికులకు రైలు షెడ్యూల్‌లు, స్టేషన్ వివరాలు, టికెట్ కౌంటర్లు, షెల్టర్, ఇతర విషయాలలో సహాయం చేయడానికి 18004199139 అనే టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ హెల్ప్‌లైన్ నవంబర్ 1 నుండి అందుబాటులో ఉంటుందని అన్నారు.
మొదటిసారిగా ఈ హెల్ప్‌లైన్ హిందీ, ఇంగ్లీష్ తో పాటు ఇతర ప్రాంతీయ భాషలలో సమాచారాన్ని అందిస్తుంది, దేశ నలుమూలల నుండే కాదు విదేశాల నుండి ప్రయాగరాజ్ కు వెళ్లేవారికి ఈ హెల్ప్ లైన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మహా కుంభమేళా కోసం ప్రత్యేక రైళ్లు, రైల్వే స్టేషన్ల సమాచారం ఇండియన్ రైల్వేస్ వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంటుంది.
అదనంగా రైల్వే డివిజన్ ప్రత్యేక మహాకుంభ్ మొబైల్ యాప్‌పై పనిచేస్తోంది. ఇది త్వరలో అందుబాటులోకి వస్తుంది. ప్రయాగరాజ్ కు వెళ్ళే సందర్శకుల సౌలభ్యం కోసం రైలు సేవల గురించి ముఖ్యమైన వివరాలను అందించనున్నారు.