ప్రయాగరాజ్ కుంభమేళాకు వచ్చే భక్తులు సాధుసంతుల కోసం ఇక వెతుక్కోవాల్సిన అవసరం లేదు ... గూగుల్ మ్యాప్ ద్వారా వారు ఎక్కడున్నారో కనుగొనవచ్చు. ఈ మేరకు కుంభమేళా అథారిటీ గూగుల్ తో ఒప్పందం చేసుకుంది.
ప్రయాగరాజ్ : యోగి ప్రభుత్వం ప్రయాగరాజ్ కుంభమేళాాలో ఆద్యాత్మికతను కాపాడుతూనే టెక్నాలజీని వినియోగించే ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే మహా కుంభమేళా గొప్పతనాన్ని అంతర్జాతీయ సంస్థ గూగుల్ కూడా గుర్తించింది. దీంతో తన విధానాన్ని మార్చుకుని మరీ తాత్కాలిక నగరానికి (మహా కుంభమేళా మేళా ప్రాంతం) నావిగేషన్‌ను అనుసంధానించాలని గూగుల్ నిర్ణయించింది. ఈ మేరకు గూగుల్, మహాకుంభమేళా అథారిటీ మధ్య ఒక ఒప్పందం కుదిరింది.
ఈ ఒప్పందం ప్రకారం గూగుల్ మహా కుంభమేళా కోసం ప్రత్యేక నావిగేషన్‌ను అభివృద్ధి చేస్తుంది. దీని ద్వారా భక్తులు అన్ని ప్రదేశాలు, అఖారాలు, సాధువుల స్థానాలను ట్రాక్ చేయవచ్చు. ఈ ప్రత్యేక నావిగేషన్ నవంబర్ చివరిలో లేదా డిసెంబర్ ప్రారంభంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
undefined
సనాతన విశ్వాసం యొక్క అతిపెద్ద కార్యక్రమం మహాకుంభమేళా భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ గొప్ప సమావేశంలో పాల్గొనాలని ఆసక్తిగా ఉంటారు.
నావిగేషన్ అంటే ఒక ప్రదేశానికి వెళ్లే మార్గం యొక్క వివరణాత్మక సమాచారం. గతంలో ప్రజలు కాగితం మ్యాప్‌లను ఉపయోగించేవారు లేదా ప్రజలను అడిగి ఆఛూకీ తెలుసుకునేవారు... కానీ ఇప్పుడు గూగుల్ నావిగేషన్ ద్వారా ఇది చాలా సులభం అయింది. ఈ నావిగేటర్లు మీకు మ్యాప్‌ను మాత్రమే కాకుండా, ఎప్పుడు ఎక్కడ తిరగాలో కూడా చూపుతాయి.
గూగుల్ సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాలకు నావిగేషన్‌ను అందిస్తుంది, కానీ తాత్కాలిక నగరానికి ఈ సౌకర్యాన్ని అందించడానికి ఇది మొదటిసారి అంగీకరించింది. ఇందులో ప్రధాన రోడ్లు, మతపరమైన ప్రదేశాలు, ఘాట్‌లు, అఖారాలు, ప్రముఖ సాధువుల స్థానాల సమాచారం ఉంటుంది.
కుంభమేళా అధికారి వివేక్ చతుర్వేది మాట్లాడుతూ... ప్రపంచ నలుమూలల నుండి ప్రయాగరాజ్ కుంభమేళాకు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారని తెలిపారు. అయితే రెండు నెలల పాటు జరిగే తాత్కాలిక కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాలకు గూగుల్ ఇంతకు ముందెన్నడూ నావిగేషన్‌ను అనుమతించలేదు. కానీ మహా కుంభమేళా గొప్పతనం తెలుసుకుని, హాజరయ్యే ప్రజలను పరిగణనలోకి తీసుకుని గూగుల్ తన విధానాన్ని మార్చుకుంది... ఈ మహా కుంభమేళా ప్రాంతాన్ని తన నావిగేషన్ మ్యాప్‌లో చేర్చింది.
గూగుల్, మేళా అథారిటీ మధ్య జరిగిన ఈ ఒప్పందం ప్రయోజనం ప్రయాగరాజ్ మహా కుంభమేళా సమయంలో వచ్చే 45 కోట్లకు పైగా భారతీయులు, విదేశీ భక్తులకు లభిస్తుంది వారు తమ గమ్యస్థానాలకు సులభంగా చేరుకోవచ్చు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ మహా కుంభమేళాలో భక్తుల సౌలభ్యం కోసం డిజిటల్ సాంకేతికతను ఉపయోగించాలని నిర్ణయించారు. మేళా అథారిటీ యొక్క ఈ చర్య ఆయన ఉద్దేశానికి అనుగుణంగా ఉంది. దీని ద్వారా ఇక్కడికి వచ్చే భక్తులకు తమ గమ్యస్థానానికి చేరుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. తమ మొబైల్‌లో గూగుల్ మ్యాప్ ద్వారా వారు తమ గమ్యస్థానం యొక్క పూర్తి నావిగేషన్‌ను పొందవచ్చు, దాని మార్గదర్శకత్వంలో సులభంగా లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
ఒక భక్తుడు సంగమ తీరానికి వెళ్లాలనుకుంటే, ఒక నిర్దిష్ట అఖారా చిరునామాను కనుగొనాలనుకుంటే, ఒక దేవాలయంలో దర్శనం చేయాలనుకుంటే, ఎవరినీ అడగవలసిన అవసరం ఉండదు. తమ మొబైల్‌లో గూగుల్ నావిగేషన్ ద్వారా వారు దానిని సులభంగా కనుగొనవచ్చు. నావిగేషన్‌ను ఉపయోగించడం ద్వారా ఒక నిర్దిష్ట సాధువును చేరుకోవడం కూడా సులభం అవుతుంది.