ఇక వారమంతా యూపీ అడవుల్లో షికారు ... ప్రకృతి ప్రేమికులకు యోగి సర్కార్ గుడ్ న్యూస్

By Arun Kumar P  |  First Published Nov 7, 2024, 1:19 PM IST

యోగి సర్కార్ యూపీలో ఈకో-టూరిజాన్ని బాగా ప్రోత్సహిస్తుంది. దుధ్వా టైగర్ రిజర్వ్‌లో మంగళవారం సెలవు రద్దు చేసి వారమంతా సఫారీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. 


లక్నో : ఉత్తర ప్రదేశ్ లో ఈకో-టూరిజం సీజన్ నవంబర్ 6 నుండి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2024-25 సీజన్‌లో లఖింపూర్‌లోని దక్షిణ ఖీరీ అటవీ డివిజన్‌లో మహేష్‌పూర్ (మొహమ్మది) ఈకో-టూరిజం, బఫర్ డివిజన్‌లో భీరా టూరిజం సర్క్యూట్‌ను కూడా ప్రారంభిస్తున్నారు. పర్యాటకుల సౌలభ్యం కోసం దుధ్వా టైగర్ రిజర్వ్‌లో మంగళవారం సెలవును రద్దు చేశారు... ఇప్పుడు పర్యాటకులు అక్కడ వారమంతా సందర్శించవచ్చు. పర్యాటకులకు సహాయం చేయడానికి నేచర్ గైడ్‌లను కూడా నియమించారు.

యోగి సర్కార్ అందిస్తున్న సౌకర్యాలు, భద్రత కారణంగా దుధ్వా, పీలీభిత్, అమన్‌గఢ్, రాణిపూర్ టైగర్ రిజర్స్ లోని ఈకో-టూరిజం ప్రదేశాలకు ఏటా పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా యూపీ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి డాక్టర్ అరుణ్ కుమార్ సక్సేనా కతర్నియాఘాట్, బహ్రాయిచ్ నుండి పర్యాటక సీజన్‌ను ప్రారంభిస్తారు.

 ఫీజులు కాదు, సౌకర్యాలు పెంచుతాం. 

Latest Videos

అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అరుణ్ కుమార్ సక్సేనా మాట్లాడుతూ... పర్యాటక అవకాశాల దృష్ట్యా యూపీకి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారని అన్నారు. ఈ ఏడాది పర్యాటక రుసుము పెంచబోము, కానీ సౌకర్యాలను మెరుగుపరుస్తామని మంత్రి స్పష్టం చేసారు. దుధ్వాలో మంగళవారం సెలవును రద్దు చేశామని... దీనివల్ల వారమంతా ప్రకృతిని ఆస్వాదించేవారికి అవకాశం దక్కుతుందన్నారు.

ఇక పర్యాటకుల కోసం 30 మంది ఆతిథ్య సిబ్బందికి శిక్షణ ఇచ్చామని... వీరికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ ద్వారా హౌస్ కీపింగ్, వంటలకు సంబంధించిన విషయాలు నేర్పించామన్నారు. ఈకో-టూరిజం బోర్డు సహాయంతో దుధ్వా, కతర్నియాఘాట్, పీలీభిత్, రాణిపూర్‌లలో నేచర్ గైడ్‌లకు శిక్షణ ఇచ్చారు... వీరంతా ది నేచర్ స్కూల్ బెంగళూరులో శిక్షణ తీసుకున్నారని అన్నారు. .

 రాష్ట్రంలోని అన్ని ఈకో-టూరిజం ప్రదేశాల్లో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని మంత్రి తెలిపారు. ప్రజలను ఈకో-టూరిజం ఆస్వాదించేలా ప్రోత్సహించడమే దీని ఉద్దేశ్యమన్నారు. యోగి సర్కార్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా ఇందులో పాల్గొంటున్నట్లు తెలిపారు. దుధ్వా, పీలీభిత్, అమన్‌గఢ్, రాణిపూర్ టైగర్ రిజర్వ్‌లు... కతర్నియాఘాట్, సోహెల్వా, కైమూర్, కన్నౌజ్, మహావీర్ స్వామి,  లలిత్‌పూర్, చంద్రప్రభా వన్యప్రాణుల అభయారణ్యం... , షహీద్ చంద్రశేఖర్, నవాబ్‌గంజ్, సాండి, హర్దోయి, లాఖ్, చందౌలి, ఓఖ్లా పక్షుల అభయారణ్యం...  గౌతమ్ బుద్ధ నగర్, రప్తీ ఈకో-టూరిజం కేంద్రం, ఫిరోజాబాద్ మొదలైన చోట్ల కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది.

యూపీ టైగర్ రిజర్వ్‌లకు ఆకర్షణ, ఏటా పెరుగుతున్న పర్యాటకుల సంఖ్య

click me!