నిరుద్యోగులకు శుభవార్త : ఉద్యోగాల భర్తీ దిశగా కీలక ముందడుగు

By Arun Kumar P  |  First Published Nov 7, 2024, 9:54 AM IST

యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందకు సిద్దమయ్యంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసిన ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది. 


లక్నో: చాలాకాలంగా ఆర్ఓ-ఏఆర్ఓ ప్రిలిమ్స్, పీసీఎస్ ప్రిలిమ్స్ పరీక్ష తేదీల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది అభ్యర్థులకు ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుభవార్త చెప్పింది. ఆర్ఓ-ఏఆర్ఓ పరీక్ష డిసెంబర్ 22, 23 తేదీల్లో మూడు షిఫ్టుల్లో, పీసీఎస్ ప్రిలిమ్స్ పరీక్ష డిసెంబర్ 7, 8 తేదీల్లో రెండు సెషన్లలో జరుగుతాయి.

యూపీపీఎస్సీ ప్రకారం పీసీఎస్ ప్రిలిమ్స్ పరీక్ష డిసెంబర్ 7, 8 తేదీల్లో రాష్ట్రంలోని 41 జిల్లాల్లో రెండు సెషన్లలో జరుగుతుంది. మొదటి సెషన్ ఉదయం 9:30 నుండి 11:30 వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2:30 నుండి 4:30 వరకు ఉంటుంది. ఆర్ఓ-ఏఆర్ఓ (రివ్యూ ఆఫీసర్, అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్) ప్రిలిమ్స్ డిసెంబర్ 22, 23 తారీఖుల్లో మూడు షిఫ్టుల్లో జరుగుతుంది.

Latest Videos

undefined

ఆర్ఓ-ఏఆర్ఓ ప్రిలిమ్స్‌లో మొదటి, రెండవ షిఫ్టులు డిసెంబర్ 22న ఉంటాయి. మొదటి షిఫ్ట్ ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు, రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు ఉంటుంది. మూడవ షిఫ్ట్ డిసెంబర్ 23న ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది.

ఈ పరీక్షకు 10.76 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కమిషన్ నిబంధనల ప్రకారం అభ్యర్థుల సంఖ్య 5 లక్షల కంటే ఎక్కువ వుంటే షిఫ్టుల వారిగా పరీక్షలు నిర్వహించాలి. అందుకే ఈ పరీక్షలను షిఫ్టులుగా విభజించారు.  

click me!