యోగి ప్రభుత్వ కృషితో ప్రయాగరాజ్ లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి... దేశ ప్రజల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. కుంభమేళాకు రెండునెలల ముందే ఈ పరిస్థితి వుంటే ప్రారంభం తర్వాత ఎలా వుండనుందో ఊహించవచ్చు.
ప్రయాగరాజ్ : ప్రపంచంలోనే అత్యంత గొప్ప సాంస్కృతిక ఉత్సవంగా ప్రయాగరాజ్ మహా కుంభమేళా 202 ని మలచాలని యోగి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందుకోసమే కుంభమేళా ప్రారంభానికి చాలాముందునుండే ఏర్పాట్లతో నిమగ్నమయ్యింది. అత్యంత సమర్థులైన అధికారులను ఈ కుంభమేళా పనుల పర్యవేక్షనకు నియమించింది.
ఇలా యోగి ప్రభుత్వం ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల చూపుతున్న చొరవ కారణంగా దేశ నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఏడు తరాలకు మోక్షం కలిగించాలనే ఆకాంక్షతో విదేశాల నుండి కూడా ప్రజలు సంగమ నగరికి చేరుకుంటున్నారు. ప్రయాగరాజ్‌కు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని యోగి ప్రభుత్వం అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేసింది.
undefined
ఈసారి ఎలాగైనా కుంభమేళాలో పాల్గొనాలని ప్రజలు భావిస్తున్నారు... దీంతో కోట్లాది మంది భక్తులతో ప్రయాగరాజ్ జనసంద్రంగా మారడం ఖాయంగా కనిపిస్తుంది. కుంభమేళాకు ఇంకా రెండు నెలల సమయం వున్నా మెళ్లిగా భక్తులు ప్రయాగరాజ్ బాట పట్టారు... రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతోంది. ఇలా తీర్థరాజ్ ప్రయాగ దేశానికి ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతోంది.
మహా కుంభమేళా ప్రారంభంకంటే ముందే తమ పూర్వీకుల ఆత్మశాంతి కోసం దేశవిదేశాల నుండి వచ్చే వారి సంఖ్య అకస్మాత్తుగా పెరిగిందని ప్రయాగరాజ్‌లోని సంగమ ఘాట్ పూజారి పండిట్ మహేంద్ర నాథ్ శర్మ తెలిపారు. ఏడు, ఎనిమిది తరాలకు మోక్షం కలిగించడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. అంతేకాకుండా తమ పూర్వీకుల గురించి సమాచారం లేని విదేశీయులు కూడా ఇక్కడికి వస్తున్నారని తెలిపారు. ప్రయాగరాజ్ ఘాట్‌ల వద్ద ఉన్న పూజారులు వారికి అవసరమైన సమాచారాన్ని అందిస్తున్నారని వెల్లడించారు.
యోగి ప్రభుత్వం నిర్వహిస్తున్న నిర్మాణ పనులను చూసి స్థావరులు, భక్తులు సంతోషిస్తున్నారని ప్రయాగరాజ్‌కు చెందిన ప్రముఖుడు ప్రయాగ్వాల్ సుబ్రహ్మణ్యం శాస్త్రి అలియాస్ చారిజీ అన్నారు. ప్రయాగరాజ్ ఘాట్‌ల వద్ద బ్రాహ్మణులు, పూజారులు, పండితుల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు.
మహా కుంభమేళా ఏర్పాట్ల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ నుండే కాకుండా దేశ నలుమూలల నుండి భక్తులు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి అనేక రాష్ట్రాల నుండి వేలాది మంది ప్రజలు ప్రయాగరాజ్‌లో పూజలు చేయిస్తున్నారు. అమెరికా, కెనడా, మారిషస్, ఆస్ట్రేలియా, రష్యా వంటి దేశాల్లో నివసిస్తున్న భారతీయులు కూడా ఈ కుంభమేళాకు వస్తున్నారు. వారిలో చాలా మంది తమ పూర్వీకుల అస్థికలను కూడా తీసుకువస్తున్నారు.
సంగమ తీరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడానికి టీమ్‌వర్క్‌తో పనిచేస్తున్నారు. ఈ బాధ్యతను నిర్వహిస్తున్న పంకజ్ పాండే మాట్లాడుతూ, ఇక్కడికి వచ్చే ప్రజలు తమ పూర్వీకుల ఆత్మశాంతి కోసం పూజలు చేస్తారు, బ్రాహ్మణులకు దానధర్మాలు చేస్తారు, దీనివల్ల చాలా మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు.
ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు భగీరథుడు తపస్సు చేసి గంగానదిని భూమిపైకి తీసుకువచ్చాడని, కపిల ముని శాపం వల్ల భస్మమైన అరైవరు సగర పుత్రులకు మోక్షం కలిగించాడని ప్రతీతి. గంగానదిని భూమిపైకి తీసుకురావడంలో భగీరథుడి కృషికి గుర్తింపుగా గంగానదిని భాగీరథి అని కూడా పిలుస్తారు.